‘ మై డ్రీమ్ అబ్రాడ్ ‘ స్టడీ సెంటర్ బ్రోచర్ ను ఆవిష్కరించిన బి.ఆర్.ఎస్. ఎంపీ అభ్యర్థి నామ

‘ మై డ్రీమ్ అబ్రాడ్ ‘ స్టడీ సెంటర్ బ్రోచర్ ను ఆవిష్కరించిన బి.ఆర్.ఎస్. ఎంపీ అభ్యర్థి నామ
జ్ఞాన తెలంగాణ ఏప్రిల్29,ఖమ్మం జిల్లా ప్రతినిధి: ఖమ్మంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో సోమవారం సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు చేతుల మీదుగా విదేశీ విద్యకు సంబంధించిన ‘ మై డ్రీమ్ అబ్రాడ్ ‘ స్టడీ సెంటర్ బ్రోచర్ ను ఆవిష్కరించడం జరిగింది. పేద వర్గాలకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావాలని, ఖమ్మం లో ఇందుకు సంబంధించి స్టడీ సెంటర్ ప్రారంభించిన నిర్వాహకులను ఈ సందర్భంగా నామ అభినందించారు.ఈ కార్యక్రమంలో స్టడీ సెంటర్ యజమాని పెద్దప్రోలు మధుకుమార్, నామ భవ్యతేజ, సాయిరామ్, రావులపల్లి అవినాష్, సరిపూడి గోపీ సందేశ్ తదితరులు పాల్గొన్నారు.