ఆత్మగౌరవ ప్రతీక లో దేవులపల్లి రమేశ్ కు చోటు

ఆత్మగౌరవ ప్రతీక లో దేవులపల్లి రమేశ్ కు చోటు
సిద్దిపేట, నంగునూర్
సమ్మక్క- సారలమ్మలపై జాతర దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర, అట్టి జాతరపై బండి ఉష, సంపాదకత్వంలో 535 మంది కవుల, కవయిత్రుల విరచిత కవిత, గేయ, పద్య, మహా సంకలనం, శ్రీ సమ్మక్క -సారలమ్మల మేడారం జాతర,పై విశిష్టతను తెలిపే విధంగా ఆత్మ గౌరవ ప్రతీక, పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా నంగునూరు మండల కేంద్రానికి కు చెందిన ఎంజేపి, తెలుగు అతిధి ఉపాధ్యాయుడు,రచయిత దేవులపల్లి రమేశ్,కు ఆత్మగౌరవ ప్రతీకలో, మహా సంకలనంలో, అంబరమంటే సంబురం, కవితకు చోటు దక్కింది. తనకు భాగస్వాములను చేసినందుకు బండి ఉషాకు కృతజ్ఞతలు తెలిపారు. సంబంధిత పుస్తక ప్రతులను కవి లక్ష్మయ్య, మహా సంకలనం అందజేశారు.
