మే డే వేడుకలను విజయవంతం చేయాలి:

జ్ఞాన తెలంగాణ,నారాయణపేట టౌన్, ఏప్రిల్ 28:

మే డే వేడుకలను విజయవంతం చేయాలని ఐ ఎఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు రాము మాట్లాడుతూ కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సరైన పద్ధతిలో కార్మికులకు ఉపాధి చేయట్లేదని తెలియపరిచారు.నారాయణపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆటో స్టాండ్ వద్ద మే డే కర పత్రాలను విడుదల చేసారు. 138వ మే డే ఉత్సవాల్లో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
కార్మికుల ప్రజాసంఘాలు హక్కులపై నిరంతరం ప్రభుత్వాలపై పోరాటాలు చేస్తూ పని దినాలు పెంచాలని రైతుల కూలీల గోసాలు వినాలని, కార్మికుల పక్షాన ఐఎఫ్టియు నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు, ఆటో కార్మికులు ముఖ్య పాత్ర వహించారు.

You may also like...

Translate »