రాష్ట్రస్థాయిలో దుబ్బాక విద్యార్థుల ప్రతిభ.

రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలో తృతీయ బహుమతి సాధించిన దుబ్బాక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు
రాష్ట్రస్థాయి జిజ్ఞాస పోటీలో భాగంగా అర్థశాస్త్ర విభాగంలో స్థానిక దుబ్బాక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు తృతీయ బహుమతి సాధించారు.

3-4-2024 బుధవారం రోజున హైదరాబాదులోని బేగంపేట్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీ ప్రదర్శనలో బి.ఏ ద్వితీయ,తృతీయ సంవత్సరం విద్యార్థినులు స్రవంతి, శిరీష, దివ్య, జైనిషా, రమ్య, అర్థశాస్త్ర విభాగం లో రూపొందించిన “ఆర్థిక వికాసం – పరపతి సహకార సంఘాలు: సిద్దిపేట జిల్లా ఆటో క్రెడిట్ కో – ఆపరేట్ సొసైటీ ఒక ప్రత్యేక అధ్యయo”.. అనే అంశంపై పొన్నాల సునీత అర్థశాస్త్ర ఉపన్యాసకురాలు ఆధ్వర్యంలో రూపొందించిన స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టుకు అరుదైన రాష్ట్రస్థాయి తృతీయ బహుమతి దక్కినది.


ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె భవాని బహుమతి సాధించిన విద్యార్థులు ప్రాజెక్టు రూపకల్పనకు మార్గదర్శకంగా నిలిచిన అధ్యాపకురాలు పొన్నాల సునీత ను అభినందిస్తూ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్య విభాగం వారు 2016 సంవత్సరంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ల కొరకు రూపొందించిన ప్రత్యేక పరిశోధన కార్యక్రమమే జిజ్ఞాస .ఈ జిజ్ఞాస కార్యక్రమం ద్వారా విద్యార్థులలో పరిశోధన పట్ల ఆసక్తి పెరిగి స్థానిక సమస్యలపై అవగాహన కలుగుతుందని వివరించారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ బి.రమేష్ ఈ సందర్భంగా అభినందించారు. దుబ్బాక ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు జిజ్ఞాస బహుమతి రావడం ఇదే ప్రథమమని తెలిపారు. పొన్నాల సునీత మాట్లాడుతూ చిన్న చిన్న ఆర్థిక అవసరాలు అకస్మాత్తుగా ఏర్పడతాయి.

అసంఘటిత రంగాలలో ఈ ఆర్థిక అవసరాలను నెరవేర్చుకోవడానికి సహాయాన్ని అందించే ఉద్దేశంతో ‘ఒకరి కొరకు అందరూ అందరి కొరకు ఒక్కరు’ అని నినాదంతో ఏర్పడిన సిద్దిపేట ఆటో-కోఆపరేటివ్ సొసైటీ. ఈ సొసైటీ కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా ఉంటూ, ఆటో యజమానులు, డ్రైవర్లు మరియు వర్కర్ల ఆర్థిక వికాసానికి తోడ్పడే విధానాన్ని సమాజానికి తెలియపరిచే ముఖ్య ఉద్దేశంతో ప్రాజెక్టు రూపకల్పన సాగిందని తెలిపారు.
ప్రిన్సిపల్
ప్రభుత్వ డిగ్రీ కళాశాల దుబ్బాక

You may also like...

Translate »