మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ

మలేరియా వ్యాధిపై అవగాహన ర్యాలీ
జ్ఞాన తెలంగాణ,నారాయణపేట ,ఏప్రిల్ 25:
నారాయణపేట పట్టణంలో
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని
జిల్లా వైద్య శాఖ అధికారి సౌభాగ్యలక్ష్మి ర్యాలీ ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారులు గుండా ర్యాలీ నిర్వహించి వీరసవార్కర్ చౌరస్తాలో ప్రతిజ్ఞ చేశారు. జిల్లా వైద్య శాఖ అధికారి సౌభాగ్యలక్ష్మి మాట్లాడుతూ. మలేరియా వ్యాధి దోమల వల్ల వస్తుందని, ఇళ్లల్లో దోమలు లేకుండా చూసుకోవాలి చెప్పారు.ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని దోమలు అధికంగా ఉన్న కాలనీలో చిన్న పిల్లలని బయటకి పంపించకుండా , తల్లిదండ్రులు జాగ్రత్త చూసుకోవలని తెలిపారు.
ప్రతిరోజు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొని దోమలు లేకుండా ఇలాంటి క్రిములు రాకుండా జాగ్రత్త వహించాలని ప్రకటించారు. ఇలాంటి
లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేసుకోవాలని మనవి చేశారు.
