మొదటి సల్ఫా ఔషధాన్ని కనుగొన్న శాస్త్రవేత్త
మొదటి సల్ఫా ఔషధాన్ని కనుగొన్న శాస్త్రవేత్త గెర్ హర్డ్ డొమాక్ గారి సేవలు చిరస్మరణీయం
సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి

ఏప్రిల్ 24 న మొదటి సల్ఫా ఔషధాన్ని కనుగొన్న శాస్త్రవేత్త శ్రీ (GERHARD DOMAGK) గెర్హార్డ్ డొమాక్ గారి వర్థంతి సందర్భంగా
డోన్ పట్టణం లో సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆద్వర్యం లో మొదటి సల్ఫా ఔషధాన్ని కనుగొన్న శాస్త్రవేత్త శ్రీ గెర్ హర్డ్ డొమాక్ (GERHARD DOMAGK) గారి వర్థంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు. వారిని స్మరించుకున్నారు.
ఈ సందర్బంగా సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి మాట్లాడుతూ
మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కోరారు
గెర్హార్డ్ డొమాగ్ అక్టోబర్ 30, 1895 జన్మించారు. ఈయన జర్మన్ బ్యాక్టీరియాలజిస్ట్ మరియు రోగనిర్ధారణ శాస్త్రజ్ఞుడు. 1935లో గెర్‌హార్డ్ డొమాగ్ సల్ఫోనా మైడ్‌లు ప్రవేశపెట్టారు. ఇవన్నీ సల్ఫానిలమైడ్ సమ్మేళనానికి సంబంధించినవి. అనేక బ్యాక్టీరియా వ్యాధులకు మొదటి విజయవంతమైన చికిత్సలను అందించాయి.
అలాగే వారు యాంటీబయాటిక్స్‌కు ఆద్యులుగా నిరూపించబడ్డారు. ఈయన నోబెల్ ప్రియోలజీ అవార్డును అందుకున్నాడు. డోమాగ్ ఏప్రిల్ 24, 1964 స్వర్గస్తులైనారు.ఈలాంటి మహనీయులను అనుక్షణం స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కోరారు.మీ పి.మహమ్మద్ రఫి , సామాజిక కార్యకర్త డోన్.