మావోయిస్టు శంకర్ కుటుంబానికి మంత్రి సీతక్క పరామర్శ


చత్తీస్ ఘడ్ జిల్లాలో తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టు శంకర్ దంప తుల కుటుంబాన్ని మంత్రి సీత‌క్క ఈరోజు ప‌రామ‌ర్శిం చారు.

జ‌య‌శంక‌ర్ భూపాలప‌ల్లి జిల్లా చిట్యాల మండ‌లం లోని చ‌ల్లగరిగ గ్రామానికి చెందిన మావోయిస్టు సుధాకర్ అలియాస్ శంకర్ చత్తీస్ ఘడ్ రాష్ట్రం కాంకేడ్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంట ర్‌లో మృతి చెందాడు.

బుధ‌వారం మంత్రి సీత‌క్క భూపాల‌ప‌ల్లి ఎమ్మెల్యే గండ్ర స‌త్య‌నారాయ‌ణ‌రావుతో క‌లిసి వెళ్లి ఆ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. శంకర్ తల్లి రాజ పోచమ్మను ఓదార్చారు.

కుటుంబానికి అండగా ఉంటామని హామినిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, కాంగ్రెస్ జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు.

You may also like...

Translate »