కేంద్ర దుర్మార్గ పాలనపై సమరం
కేంద్ర దుర్మార్గ పాలనపై సమరం
షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్”
వంశీ చందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్నీ గెలిపించుకుందాం
ఎన్నికల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్ నగర్: హనుమాన్ జయంతి రోజున పార్లమెంటు ఎన్నికల కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా శుభదినం అని షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్”
అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం ఉదయం ఉమ్మడి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి సంబందించిన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శంకర్ లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం హనుమాన్ జయంతి సందర్బంగా మా అభ్యర్థి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
రాముడు అందరివాడు అలాగే ఆయన భక్తుడు వీర హనుమాన్ ప్రతి ఒక్కరికి ఆరాధ్య దైవం అని తెలిపారు. రాముడు ఏ ఒక్కరికో సొంతం కాదని అన్నారు. కొందరు రాముడి పేరు చెప్పుకుని రాజకీయాలు చేయడం సరికాదని సూచించారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు చెంది తిరుపతి రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి యువ నాయకుడు జితేందర్ రెడ్డి నియోజక వర్గంతో పాటు మండలాల కాంగ్రెస్ నాయకులు, బాద్యులు, కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు.. కేపీ