పెండింగ్లో ఉన్న కూలీల డబ్బులు ప్రభుత్వము వెంటనే చెల్లించాలి:

నారాయణపేట జిల్లా పలు గ్రామాల్లో రైతు కూలీల బకాయిలు చెల్లించలేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వేసవి కాలంలో ఎర్రటి ఎండలో కష్టం చేసిన మా డబ్బులు ఇప్పటికి కూడా మాకు అందట్లేదు.ఉపాధిహామీ కూలీలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ప్రశాంత్ డిమాండ్ చేశారు.

నారాయణపేట మండలం చిన్నజట్రం, లక్ష్మీపూర్ గ్రామాలలో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలను కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మాట్లాడుతూ. ప్రభుత్వం వెంటనే ప్రజల సమస్యలు తీర్చాలని కోరారు.ప్రాంతాల్లో కూలీలు మరణిస్తే 10 లక్షలు ఇవ్వాలని కోరారు.
పని ముట్లు ప్రభుత్వం అందించాలన్నారు.

You may also like...

Translate »