AP SET 2024 Hall Tickets: ఏపీ సెట్‌ 2024 అడ్మిట్‌కార్డులు విడుదల.

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఏపీ సెట్‌) 2024 అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. సెట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈమెయిల్‌ ఐడీ లేదా మొబైల్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి అడ్మిట్‌కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లోఏప్రిల్ 28వ తేదీన జరగనుంది. ఈ మేరకు పరీక్ష నిర్వహణకు ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పాట్లు చేస్తోంది.

కాగా రాష్ట్రంలోని కాలేజీలు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, డిగ్రీలెక్చరర్లుగా ఉద్యోగం పొందాలంటే ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సెట్)లో అర్హత పొందాల్సి ఉంటుంది. ఈ పరీక్షను ప్రతీ యేట రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. సెట్‌ పరీక్ష మొత్తం రెండు పేపర్లకు జరుగుతుంది. మొదటి పేపర్‌లో జనరల్‌ స్టడీస్‌ 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్‌ 2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. మూడు గంటల వ్యవధిలో పరీక్ష జరుగుతుంది.

You may also like...

Translate »