ప్రభుత్వ ఉద్యోగం సాధించిన రావుల క్రాంతి
ప్రభుత్వ ఉద్యోగం సాధించిన రావుల క్రాంతి
ఙ్ఞాన తెలంగాణ, సంగెం:

సంగెం గ్రామానికి చెందిన రావుల సూరయ్య విజయ దంపతుల చిన్న కుమారుడు రావుల క్రాంతి 2022 సంవత్సరంలో పోలీస్ నోటిఫికేషన్ కి అప్లై చేసి టెక్నికల్ పోస్టులో భాగంగా పోలీస్ ట్రాన్స్ పోర్టు ఆర్గనైజేషన్‌లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించారు.దీంతో ఉద్యోగం సాధించిన పులి రాజశేఖర్, రావుల క్రాంతి ఇంటి వద్దకు వెళ్లి అభినందనలు తెలిపారు.
అనంతరం శాలువతో ఆయనతో పాటు ఆయన తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పులి రాజశేఖర్ మాట్లాడుతూ సంగెం గ్రామం నుండి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం చాలా ఆనందకరమైన విషయం అని అన్నారు.
వీరిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా విద్యార్థిని, విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి రేపటి తరానికి ఆదర్శంగా నిలువాలని కోరారు.