మూసీ రహదారిపై కానరాని వేగ నియంత్రణ బోర్డులు
మూసీ రహదారిపై కానరాని వేగ నియంత్రణ బోర్డులు
కిలోమీటర్ల దూరంలో ఎక్కడా కనబడని ప్రమాద సూచికలు
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:

మూసీ రహదారిపై ఎక్కడా కూడా ప్రమాద సూచికలు, హెచ్చరిక బోర్డులు, వేగనియంత్రణ బోర్డులు కనబడిన దాఖలాలు లేవు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందుకులు గురౌతున్నారు. సరైన సూచికలే లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. గతంలో అనేక ప్రమాదాలు సంభవించాయి. అయినా అధికారులు బోర్డులు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని ఇండికేషన్స్ ఏర్పాటు చేయాలని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు.
పురాణా పూల్ చౌరస్తా నుంచి మూసి మార్గం గుండా అత్త పూర్ మార్గాన్ని కలిపే పెద్ద రోడ్డు మార్గం ఏర్పాటు చేశారు. ఈ మార్గం ట్రాఫిక్ రద్దీ నుంచి సులువుగా మెహిదీపట్నం, లంగర్ హౌస్, అత్త పూర్, వెళ్లే వాహనదారులకు ఎంతో అనుకూలమైన రహదారి.
నిత్యం ఈ మార్గం గుండా ద్విచక్ర బస్సులు ట్రాలీలు ఇతర వాహనాలు నిత్యం రాక పోకలు సాగిస్తుంటారు.ఐతే రాత్రనక పగలు అనక వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటారు.
ఎక్కడ సిగ్నల్స్ కానీ సూచికలు లేవు…
సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర ఉన్న ఈ విశాల మైన రోడ్డు మార్గం లో ఎక్కడ సిగ్నల్స్ కానీ సూచికలు కానీ ఏర్పాటు చేయక పోవడం తో అతి వేగంగా వెళ్లే వాహనాల వల్ల ప్రమాదం పొంచి ఉంది. పురాణా పూల్ నుంచి కొంత మేర లోతు గా ఉండే ఈ మార్గం లో వాహనాలు వేగంగా వెళుతుడండం తో వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాహనాలు నడిపిస్తున్నారు.ఇదే మార్గం లో ఉదయం సాయంత్రం ఐతే వాకర్స్ సందట్లో సడేమియా అన్నట్లుగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు ఈ మార్గం గుండా పెద్ద ఎత్తున నడుస్తుంటారు.
ఈ మార్గం లో వాహనాలు అతి వేగంగా వచ్చి ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఒక వైపు మూసీ మరో వైపు కాలనీలు ఉండడంతో ఈ మార్గం గుండానే తమ కాలనీలకు చేరుకుంటారు.
యు టర్న్ లది మరో సమస్య మూసీ పరివాహక ప్రాంతం ఓ వైపున మాత్రమే ఉన్న అతి విశాలమైన మార్గం కావడం ఈ మార్గం గుండా కాలనీలకు ఇతర మార్గాలకు వెళ్లే మార్గాలు వద్ద ప్రమాద ఘంటికలు అతి వేగంగా వచ్చే వాహనాలతో మరో సమస్య. కాలనీలకు వెళ్లే మార్గాల వద్ద ఎలాంటి సూచికలు లేవు. దీంతో వాహనదారులు ఎటు వైపు వెళుతున్నారో ఎటు వైపు వస్తున్నారో అర్థం కాని గందర గోళంలో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
ఈ మార్గం లో వాహనాలు నిలిపి ఉంచడం మరోసమస్య …
మూసి రహదారి పై రోడ్డు పైనే వాహనాలు నిలుపుతున్నారు.ఇది చాలా ప్రమాదం దీనికి తోడు అక్కడ అక్కడ తొవ్వి వదిలేయడం గుంతలు పలు చోట్ల రహదారి కుచించుకు పోవడం వల్ల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి.దీనికి తోడు వ్యర్ధాలు కూడా పెద్ద ఎత్తున చేరుతున్నాయి.దీంతో వచ్చి పోయే వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.అడవిని తలపిస్తున్నట్లుగా ఉండే ఈ మార్గం లో రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన వీది దీపాలు సరిగా వెలగడం లేదు. దీని వలన కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఈ మార్గం లో వ్యాపారులు ముఖ్యంగా మేకలు అమ్మేవాళ్ళు టి కొట్టు వాళ్ళు అదే విధంగా మూసి ఒడ్డున మూసి.లో వెలిసిన దేవాలయాల వద్ద కు తమ వాహనాలను రోడ్డు పై పెట్టీ వెళ్ళడం తో ప్రమాదాలు జరిగే అవకాశం.కూడా లేక పోలేదు.
మూసి నది రోడ్డు పరివాహక ప్రాంతాన్ని సుందరంగా తీర్చి దిద్దాలి
నిజాం కాలం ముందు నుంచి ఉన్న మూసి నది హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చిన నదీ పకృతి రమణీయతకు నెలవైన మూసి తెలంగాణ వికారాబాద్ కొండల్లో పుట్టి వేల కిలో మీటర్లు ప్రవహించి హైదరాబాద్ తాకుతూ వెళుతుందడం తో అప్పటి నిజాం మూసి చుట్టూ రాతి కట్టడం నిర్మాణం చేశారు.
ఎలాంటి మూసి కృష్ణ నది లో కలుస్తుంది హైదరాబాద్ నగరం విస్తరించడం తో కాలుష్య కోరల్లో చిక్కి విల విల లాడుతుంది హైదరాబాద నగరంలో కేవలం పురణా పూల్ వద్ద మూసి నుంచి అత్త పూర్ వరకు రోడ్డు మార్గం ఉంది ఎక్కడ లేదు.గతం లో రాజశేఖర్ రెడ్డి.ప్రభుత్వం మూసి నది పరివాహక ప్రాంతాన్ని సుందర వనంగా తీర్చి దిద్దడం కోసం కోట్ల నిధులు వెచ్చించారు.
కొంత మేర పనులు నడిచాయి ఆయన పోయిన తర్వాత ఎక్కడ పనులు అక్కడే నిలిచి పోయాయి. దీనిని పట్టించుకున్న వారులేరు .ఇప్పుడు మరల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్ కూడా మూసి కి పూర్వ వైభవం తెస్తామని అన్నారు.అది ఎంత వరకు కార్యరూపం దాలుస్తుందో చూడాలి.