బీఆర్‌‌ఎస్‌కు బిగ్‌ షాక్‌

బీఆర్‌‌ఎస్‌కు బిగ్‌ షాక్‌


హస్తం గూటికి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే


సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ అయిన ప్రకాష్ గౌడ్


శుక్రవారం కార్యకర్తలతో సమావేశం


నేడు అధికారికంగా కాంగ్రెస్‌లో చేరిక

జ్ఞాన తెలంగాణ, రాజేంద్ర నగర్:


బీఆర్‌‌ఎస్‌ పార్టీకి మరో బిగ్‌ షాక్‌ తగిలింది. రాజేంద్రనగర్‌‌ బీఆర్‌‌ఎస్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ నేడు కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సీఎం రేవంత్‌తోఎ భేటీ అయ్యారు. అనంతరం నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తలతో సమావేశం అయ్యారు.

నేడు కాంగ్రెస్‌ పార్టీలో అధికారికంగా చేరనున్నట్లు సమాచారం. ప్రకాశ్‌ గౌడ్‌ రాజేంద్రనగర్‌‌ నియోజకవర్గం నుంచి ఇప్పటికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో టీడీపీ నుంచి గెలిచిన ఆయన..2014లోను టీడీపీ తరుఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు.

అనంతరం ప్రస్తుత బీఆర్‌‌ఎస్‌ గా ఉన్న నాటి టీఆర్‌‌ఎస్‌లో చేరారు. 2018, 2024 ఎన్నికల్లో గెలుపొంది నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఆయన పార్టీని వీడి పోవడంతో చేవెళ్ల పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌కు గట్టి షాక్‌ తగిలింది.

You may also like...

Translate »