ప్రణాళిక బద్దంగా త్రాగునీటి సమస్యలను నివారించాలి.

ప్రణాళిక బద్దంగా త్రాగునీటి సమస్యలను నివారించాలి.

అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను త్వరితగతిన పూర్తి చేయాలి:జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా.


జ్ఞాన తెలంగాణ భూపాలపల్లి:

పక్కా ప్రణాళికతో త్రాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు.


శుక్రవారం కలెక్టరు కార్యాలయం లోని సమావేశ మందిరంలో జిల్లాలో
త్రాగునీటి సమస్యల నివారణ, అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పురోగతిపై మండలాల ప్రత్యేక అధికారులు ఎం.పి.డి.ఓ, ఎపిఓ, ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే 3 నెలల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నందున పక్కా ప్రణాళికలతో త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ఎండల తీవ్రత వల్ల నీటి నిల్వలు అడుగంటి పోయే అవకాశం ఉందని వెంటనే గుర్తించి ప్రత్యామ్నాయంగా వ్యవసాయ బోర్ల నుండి త్రాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

మిషన్ భగీరధ పైపు లైన్ ద్వారా నీరు సరఫరా చేసే క్రమంలో ఎక్కడైనా సాంకేతిక లోపం తలెత్తినా, పైపులు పగిలిపోవడం, గేట్ వాల్వ్ లీకేజీలు జరగడం లాంటివి జరిగినా గుర్తించి తక్షణమే మరమ్మతులు చేపట్టే విధంగా ఎంపిడిఓలు గ్రిడ్, మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అధికారులు కృషిచేయాలని తెలిపారు.

ఈ 3 నెలలపాటు అప్రమత్తంగా ఉంటూ పరిస్థితి జఠిలం కాకముందే జాగ్రత్తలు చేపట్టాలనీ అధికారులు అనునిత్యం గ్రామ పంచాయతీలలో క్రమం తప్పక పరిశీలిస్తూ ఉండాలని, ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులను గ్రామ సమస్యలపై ఎప్పటికప్పుడు వాకబు చేస్తూ ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరించాలని అన్నారు.

సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలనని
అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీఓలు మిషన్ భగీరధ, గ్రిడ్ ఇంజనీర్ లు పంచాయతీ కార్యదర్శులు సమన్వయ పరుచుకుంటూ త్రాగు నీటి సమస్య రాకుండా చూడాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అమ్మ ఆదర్శ పాఠశాలల గురించి మాట్లాడుతూ ద్వారా పాఠశాలల్లో జరుగుతున్న మౌలిక సదుపాయాల పనులను జాప్యం చేయకుండా పాఠశాలలు పున ప్రారంభం వరకు పూర్తి చేయాలన్నారు.

271 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పనులు చేపట్టాల్సి ఉండగా 209 పాఠశాలలకు ఇంజినీరింగ్ అధికారులు అందచేసిన ప్రతి పాదనలు మేరకు పరిపాలనా అనుమతులు జారీ చేశామని, మిగిలిన 62 పాఠశాలల ప్రతి పాదనలు శనివారం వరకు అందచేయాలని విద్యాశాఖ అధికారిని ఆదేశించారు.


పనుల పురోగతి పై ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యా యులు నిరంతర పర్యవేక్షణ చేయాలని తెలిపారు. పనులు సకాలంలో పూర్తి చేయుటకు మైక్రో లెవెల్ ప్రణాళిక రూపొందించి పనుల్లో వేగం పెంచాలని, నాణ్యత లోపించకుండా చూడాలని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్లో ప్రతి విషయం విద్యాశాఖ అధికారులకు తెలిసి ఉండాలని తెలిపారు.


వివోఏ లకు అప్పగించిన పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు. విద్యార్థుల భవిష్యత్ తరగతి గదుల్లో రూపుదిద్దుకునే ప్రాముఖ్యత కలిగిన పనులని పకడ్బందీగా చేయాలని అన్నారు.

నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పనుల్లో జాప్యం జరిగినా, నాణ్యత లోపించినా కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పురోగతిని ప్రతి సోమవారం తనిఖీ చేయడం జరుగుతుందని పనుల్లో జాప్యం జరిగినా, నాణ్యత లోపించినా సంబంధిత ఎంపీడీవోలకు మెమోలు జారీ చేస్తామని అన్నారు.

తక్షణమే ఎంపీడీవోల ఖాతా నుండి వివోఏ సంఘాల వారి అకౌంట్ లలో డబ్బులు జమ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనవు కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు, జడ్పి సీఈఓ విజయలక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్ ఈ.ఈ నిర్మల, డి.ఆర్.డి.ఓ నరేష్, డి.పి.ఓనారాయణ రావు, గ్రిడ్ ఈ.ఈ మాణిక్యారావు, విద్యాశాఖ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడివోలు, ఎంపీవోలు పిఆర్ ఇంజనీరింగ్, ఆర్ డబ్ల్యూ యస్, గ్రిడ్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »