నేషన్స్ ఫస్ట్ హ్యూమన్ చైన్ ఫౌండేషన్ ద్వారా కెరీరీ గైడెన్స్
నేషన్స్ ఫస్ట్ హ్యూమన్ చైన్ ఫౌండేషన్ ద్వారా కెరీరీ గైడెన్స్
జ్ఞాన తెలంగాణ, కేసముద్రం విలేజ్:

కేసముద్రం విలేజ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేషన్స్ ఫస్ట్ హ్యూమన్ చైన్ ఫౌండేషన్- మిషన్ విద్య విజ్ఞాన్ ప్రాజెక్ట్ సేవలో భాగంగా, పాలిటెక్నిక్ పుస్తకాలు, ప్రేరణ, కెరీర్ గైడెన్స్, ఐఐటీ జెఇఇ ఎగ్జామ్ పై అవగాహనా సదస్సు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన , డాక్టర్ అశోక్ పరికిపండ్ల ఆరోగ్య మిత్ర స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకులు, ఎన్.ఎఫ్. హెచ్.సి. ఫౌండేషన్ తెలంగాణ స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఇస్లావత్ సుమన్, అధ్యర్యంలో మిషన్ విద్య విజ్ఞాన్ ప్రోగ్రాం నిర్వహించారు.
ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సుమన్ మాట్లాడుతూ విద్య మరియు జీవితంలో పెట్టుకోవల్సిన టార్గెట్స్ పైన శ్రద్ధ చూపడం విద్యార్థుల యుక్త వయస్సులో చాలా ముఖ్యం అని, ఒక నిర్ధిష్టమైన గమ్యాన్ని ఏర్పాటు చేసుకొని నిరంతరం ప్రయత్నం చేసినప్పుడే జీవితాన్ని అందంగా, ఆదర్శంగా మలుచుకోవచ్చు.
ఉపాధ్యాయుల మరియు తల్లితండ్రుల మాటలు విద్యార్థులు తప్పకుండ విని, పాటించాలి. గమ్యాన్ని చేరుకోనే ప్రయత్నంలో ఎన్నో అవంతరాలు వస్తుంటాయి, అయినప్పటికి వాటిని ఎదుర్కున్నప్పుడే అవి అనుభావాలుగా మారి జీవితంలో గొప్ప విజయాలు సాధించడానికి విలవుతుందని తెలిపారు. అలాగే ఐఐటీ జెఇఇ, జూనియర్ కాలేజీ, పాలిటెక్నిక్ పరీక్షల అవగాహన కల్పించారు.
తమ ఫౌండేషన్ విద్యార్థులకు ఎప్పుడు చేయూతగ ఉంటుంది.ఎప్పుడు ఏలాంటి సహకారం కావాలన్న తమ ఫౌండేషన్ నెంబర్ 78927 82387 కి సంప్రదించవచ్చు అని తెలియజేసారు. నేషన్స్ ఫస్ట్ హ్యూమన్ చైన్ ఫౌండేషన్ మరియు ఆరోగ్య మిత్ర స్వచ్చంద సంస్థల ఫౌండేషన్ ముఖ్య సభ్యులు అయిన డాక్టర్ అశోక్ పరికిపండ్ల మరియు ముడావత్ మోహన్ వారు, తమ స్కూల్ మరియు విద్యార్థుల అభివృద్ధి కోసం భవిష్యత్తులో కూడా విడతల వారీగా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారని ప్రధానోపాధ్యాయుడు జగన్ మోహన్ రెడ్డి తెలియజేసారు.
ప్రధానోపాధ్యాయుడు జగన్ మోహన్ రెడ్డి, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, కృషి, పట్టుదలతో శ్రమించి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముడావత్ మోహన్, సీనియర్ రీసెర్చ్ ఇంజనీర్, ఎన్ఐటి వరంగల్ పూర్వ విద్యార్థి సూచన మేరకు ఇచ్చిన పుస్తకాలను సద్వినియోగం చేసుకొని, అలాగే ప్రోగ్రాం కి వచ్చిన ఫౌండేషన్ సభ్యులు ఇచ్చిన గైడెన్స్ తో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సందేశం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు ఇస్లావత్ సుమన్, డాక్టర్ అశోక్ పరికిపండ్ల, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జగన్ మోహన్ రెడ్డి, ఉపాధ్యాయ బృందంతో పాటు విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
