మొయినాబాద్ లో యువతీ అదృశ్యం

మొయినాబాద్ లో యువతీ అదృశ్యం


జ్ఞాన తెలంగాణ, మొయినాబాద్
:-


మొయినాబాద్ మండలంలోని షాపూర్ గేట్ వద్ద ఉన్న ఒక ఫార్మహౌస్ లో గార్డెన్ పని చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం నుంచి వలస వచ్చిన అతిపాటి అది శేషయ్య ఫిర్యాదు మేరకు ‘‘10 రోజుల క్రితము తన సహోదరుడి కూతురు లావణ్య తన ఇంటికి వచ్చింది.

అయితే ఈ నెల 17న ఉదయం సుమారు 06:30 గంటల సమయంలో ఆమె బాత్ రూమ్ కి వెళ్తున్నాను అని చెప్పి ఇంట్లో నుండి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. చుట్టుప్రక్కల తెలిసిన వాళ్ళ దగ్గర వెతికిన ఆమె ఆచూకీ కంపించలేదు.

నెల్లూరు జిల్లా వృత్తిరీత్యా లేబర్ పని చేసుకునే అబ్బాయి పై అనుమానం ఉంది.’’ అని ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

You may also like...

Translate »