హౌస్ కీపింగ్ వర్కర్స్ పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలి
హౌస్ కీపింగ్ వర్కర్స్ పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలి
జ్ఞాన్ తెలంగాణ, జనగామ : జిల్లా కలెక్టరేట్ లో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ వర్కర్స్ కు తక్షణమే పెండింగ్ వేతనాలు చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఏవో రవీందర్ గారికి వినతి పత్రాన్ని హౌస్ కీపింగ్ వర్కర్స్ అందజేశారు.

జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో చాలీచాలని వేతనాలతో శానిటేషన్ పనులు చేస్తున్న హౌస్ కీపింగ్ వర్కర్స్ కు నెలల తరబడి వేతనాలు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారుసంబంధిత ఏజెన్సీ కాంట్రాక్టర్ ప్రభుత్వం బిల్లులు ఇస్తేనే మేము మీకు వేతనాలు చెల్లిస్తామని నాలుగు నెలల నుండి వేతనాలు ఇవ్వకపోవడం సరైనది కాదన్నారు గతంలో ఉన్న ఏజెన్సీ కాంట్రాక్టర్ సైతం మూడు నెలల వేతనాలు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టారని వాటిని సైతం ఇవ్వాలని కోరారు.
వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని అన్నారు కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే పెండింగ్ వేతనాలు అందించేలా సంబంధిత అధికారులు కాంట్రాక్టర్ ల పై చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో టీ మహేశ్వరి, పి కృష్ణవేణి,,జి సరిత, పి స్వప్న, లావణ్య, మహబూబి, సబిత, అమీనా తదితరులు పాల్గొన్నారు