కుటుంబ సమేతంగా పాల్గొన్న డిప్యూటీ సీఎం
భద్రాచలంలో ఘనంగా రాములోరి కళ్యాణ వేడుకలు
కుటుంబ సమేతంగా పాల్గొన్న డిప్యూటీ సీఎం
రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి కొండా సురేఖ
పట్టు వస్త్రాలు సమర్పించిన తెలంగాణ రాష్ట్ర సీఎస్ శాంతకుమారి
జ్ఞాన తెలంగాణ, భద్రాచలం:
భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణాన్ని తిలకించిన భక్త జనం పులకించింది.తమ ఆరాధ్య దైవమైన శ్రీరాముడు సీతమ్మ తల్లిని మనువాడిన ఘట్టాన్ని చూసిన భక్తులు తరించారు.
రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుండి సైతం భద్రాచలానికి తరలివచ్చిన భక్తులు సీతారాముల కల్యాణ వైభోగాన్ని కనులారా వీక్షించారు. భక్తుల జయ జయ ద్వనులు,వేద పండితుల మంత్రోచ్ఛారణలు కళ్యాణ తంతుతో మిధిలా స్టేడియం వైకుంఠాన్ని తలపించింది.
రాముల వారి కళ్యాణ మహోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సమేతoగా విచ్చేశారురు. మల్లు భట్టి విక్రమార్క – నందిని విక్రమార్క దంపతులు, వారి కుమారుడు సూర్య విక్రమాదిత్య వేడుకకు విచ్చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ వారితోపాటు ఈ వేడుకలు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ రాష్ట్ర సి.ఎస్ శాంత కుమారి రాములవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థానిక నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఈ వేడుకలో పాల్గొని, మిథిలా స్టేడియంలో భక్తులతో కలిసిపోయి సీతారాముల కల్యాణాన్ని వీక్షించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు భద్రాచలంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వేలాది భక్త జనం హాజరైన ఈ వేడుకలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.