గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా వినోద్ కుమార్ నాయక్ నియామకం

గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా వినోద్ కుమార్ నాయక్ నియామకం
జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల:

భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా వినోద్ కుమార్‌ను నియమించినట్లు ఆ పార్టీ నాయకులు మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు సరైన న్యాయం అందాలన్నా, దేశం మరింత అభివృద్ధి చెందాలన్నా మోడీతోనే సాధ్యమని అన్నారు. గిరిజన కుటుంబంలో పుట్టిన తనకు జాతీయ అతిపెద్ద పార్టీలో జిల్లా స్థాయిలో పదవి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు.డీకే ఆరుణ గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ నాయక్, జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహ రెడ్డి, సాయిలాల్, నియోజకవర్గ రాష్ట్ర నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి, అందే బాబయ్యలకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
