పర్ణశాలలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం

*పర్ణశాలలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం


జ్ఞాన తెలంగాణ , పర్ణశాల:
దుమ్మగూడెం మండలం, పర్ణశాలలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాములవారికి భద్రాచలం దేవస్థానం తరపున పట్టు వస్త్రాలను ఏఈఓ శ్రవణ్ కుమార్ దంపతులు, ఆలయ ప్రత్యేక అధికారి సిసి అనిల్ కుమార్ దంపతులు అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు శేషం కిరణ్ కుమార్ ఆచార్యుడు, పొడిచేటి రామభద్ర ఆచార్యులు, భరద్వాజ చార్యులు, పొడిచేటి సీతారామచార్యులు స్వామి వారి కళ్యాణ తంతును శాస్త్రోక్తంగా నిర్వహించారు. భద్రాచలం కళ్యాణ మహోత్సవానికి హాజరైన భక్తులు పర్ణశాల పుణ్యక్షేత్రం సందర్శించడంతో వేలాది భక్తులతో పర్ణశాల భక్త సంద్రమైంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, మంచినీటి సౌకర్యం, మజ్జిగ, తదితర ఏర్పాట్లుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.

You may also like...

Translate »