రాముడిని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం : కేటీఆర్

Oplus_131072
  • రాముడితో మనకు పంచాయితీ లేదు.. కేవలం బీజేపీ మోదితోనే
  • కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసాము
  • 420 హామిలిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనిక్కింది.
  • స్వలాభం కోసమే కొందరు పార్టీ వీడారు ఐన నష్టం లేదు
  • ఆడబిడ్డల కోసం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి అమలు కాలే
  • నా సవాళ్లకు సమాధానం ఇవ్వలేక బూతులు తిడుతున్న రేవంత్
  • రైతు బంధు, దళిత బంధు, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్, బతుకమ్మ చీరలు సహ అన్ని రద్దు చేసారు
  • బీజేపీ మతోన్మాదాన్ని అరికట్టాలి.. కారు గుర్తుకు ఓటు వేసి రాగిడిని గెలిపించాలి.

మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎం.కె.బీ.ఆర్ కన్వీన్షన్ నందు జరిగిన ఉమ్మడి ఘాట్ కేసర్ మండల బి.ఆర్.ఎస్. సన్నాహక సమావేశంలో ముఖ్య అతిధిగా మాజీ మంత్రి బి.ఆర్.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.

వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. ఉగాది
పచ్చడిలో ఉన్న ఆరు రుచుల మాదిరి జీవితంలో కూడా
అన్నీ ఉంటాయి… స్వలాభం కోసం కొంత మంది
నాయకులు ఇతర పార్టీలకు వెళ్లినా మన పార్టీకి
ఎలాంటి నష్టం లేదు. ప్రజలు ఇచ్చిన ప్రధాన ప్రతిపక్షం
భాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నామన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు
చేపట్టామని, 420 హామిలిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం
గద్దెనిక్కింది. రైతులకిచ్చిన ఒక్క హామీ కూడా
నెరవేర్చలేదు. ఆడబిడ్డల కోసం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి
పధకం ఇప్పటికీ అమలు కాలేదు.రుణమాఫీకి
దిక్కులేదు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు
రేవంత్ రెడ్డి మాట్లాడటం లేదు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు
ముఖ్యమంత్రి గా ఉండాలని కోరుకుంటున్నాను. నీ
ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన ఖర్మ మాకు లేదు అన్నారు .

ఫోన్ ట్యాపింగ్ మీద పెట్టిన శ్రద్ధ మంచినీళ్ల మీద పెట్టు. రైతు బంధు, దళిత బంధు, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్, బతుకమ్మ చీరలు సహ అన్ని రద్దు చేశారు. రాహుల్ భారత్ జోడో యాత్ర అని దేశమంతా తిరుగుతుంటే రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ నా పెద్దన్న అంటాడు.. లిక్కర్ స్కామ్ జరగలేదని రాహుల్ అంటే లేదు లిక్కర్ స్కామ్ జరిగిందని రేవంత్ అంటాడు. కాంగ్రెస్ లో రాహుల్, రేవంత్ రెండు నాలుకలు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కేసులు తప్పించుకోవడం కోసం బీజేపీలో చేరుతాడు.
ఒక్క సీటు కూడా రాదన్న రేవంత్ రెడ్డి నేను విసిరిన ఛాలెంజ్ పట్ల సప్పుడు లేదు.ప్రజలందరూ ఆలోచించాలి. ఎవరు సంక్షేమ పథకాలు అందించారో వారికి ఓటు వేయండి. పదేళ్లు దేశాన్ని నడిపిన మోదీ తెలంగాణకు రూపాయి ఇచ్చింది లేదు. ఒక్క రూపాయి కూడా తెలంగాణాలో రుణమాఫీ చేసింది లేదు. ఈటలకు ఓటు వేసినా ఇక్కడ ఉండడు, హుజురాబాద్ వెళ్ళిపోతాడు. లోకల్ అభ్యర్థి రాగిడిని గెలిపించాలి రాముడిని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం.. రాముడి పేరు చెప్పుకుని రాజకీయం చేసే బీజేపీని తన్ని, తరిమేద్దం.. సీఎం గుంపు మెస్త్రి అయితే ప్రధాని తాపీ మేస్త్రి.. ఇద్దరు కలిసి తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నారు. బీజేపీకి ప్రేమ ఉంటే భద్రాచలం రాముడికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలదు.. అయోధ్యలో ఉన్నది రాముడే, భద్రాచలంలో ఉన్నది కూడా రాముడే.. బీజేపీ మతోన్మాదాన్ని అరికట్టాలి.. కారు గుర్తుకు ఓటు వేసి రాగిడిని గెలిపించాలి.

You may also like...

Translate »