భారత్లో ఎన్నికల ప్రచారం.. 25 దేశాల పార్టీల ప్రతినిధులకు భాజపా ఆహ్వానం

భారత్లో ఎన్నికల ప్రచారం.. 25 దేశాల పార్టీలకు భాజపా ఆహ్వానం- సార్వత్రిక ఎన్నికల్లో విజయం కొరకు విశ్వ ప్రయత్నం – 25 దేశాల పార్టీల ప్రతినిధుల కు ఆహ్వానం పలికిన భాజపా- ఇప్పటికే 13 దేశాల ప్రతినిధుల అంగీకారం – 370 స్థానాలను గెలుచుకునే దిశగా కాషాయ పార్టీ గట్టి కసరత్

జ్ఞాన తెలంగాణ డెస్క్: ఈ ఏడాది జరగనున్న సార్వత్రికఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆయా పార్టీలుతీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ప్రచారతీరును చూసేందుకు విదేశాలకు చెందిన రాజకీయపార్టీలు త్వరలో భారత్కు రానున్నాయి. 25 దేశాలకుచెందిన ఆయా పార్టీలను కేంద్రంలోని భాజపాఆహ్వానించింది. ఈ ఆహ్వానం మేరకు పార్టీల ప్రతినిధులుత్వరలో భారత్ను సందర్శించనున్నారు. ఈ ఎన్నికల్లోభాజపా హ్యాట్రిక్ కొట్టాలని ఆ పార్టీలు ఆకాంక్షిస్తున్నట్లుతెలుస్తోంది.

ఎన్నికల స్థాయి, అధికార పార్టీ వ్యూహాలువంటి అంశాలను అంచనా వేసుకోనున్నాయి. 25 దేశాలరాజకీయ పార్టీలను ఆహ్వానించగా.. వీటిలో ఇప్పటివరకు13 ఆహ్వానాన్ని అంగీకరించాయి. జర్మనీ, బ్రిటన్, నేపాల్,బంగ్లాదేశ్ తదితర దేశాల్లోని పార్టీ ప్రతినిధులురానున్నారు.ఇదే ఏడాది అమెరికాలోనూ ఎన్నికలు జరగనున్ననేపథ్యంలో అక్కడి పార్టీలను ఆహ్వానించలేదనిసమాచారం. బ్రిటన్లోని కన్జర్వేటివ్ పార్టీ, లేబర్పార్టీలతో పాటు జర్మనీకి చెందిన క్రిస్టియన్ డెమోక్రాట్లు,సోషల్ డెమోక్రాట్లను భాజపా ఆహ్వానించింది. ప్రధానిమోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, భాజపా జాతీయాధ్యక్షుడుజేపీ నడ్డా చేసే ప్రచారాల్లో ప్రతినిధులు పాల్గోనున్నట్లుతెలుస్తోంది. ఇదిలాఉండగా.. ఏప్రిల్ 19 మొదలు జూన్1 వరకు మొత్తం 44 రోజులపాటు ఏడు దశల్లోదేశవ్యాప్తంగా పోలింగ్ నిర్వహించనుంది. ఎన్నికల్లోఎన్డీయే కూటమి 400 సీట్లు.. 370 స్థానాలనుగెలుచుకునే దిశగా కాషాయ పార్టీ గట్టి కసరత్తుచేస్తోంది.

You may also like...

Translate »