పిఆర్టియు తెలంగాణ భూపాలపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పతాక ఆవిష్కరణ.

పిఆర్టియు తెలంగాణ భూపాలపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పతాక ఆవిష్కరణ.
జ్ఞాన తెలంగాణ భూపాలపల్లి మార్చ్10:
పి ఆర్ టి యు తెలంగాణ ఏప్రిల్ 9 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా
ఈ కార్యక్రమంలోజిల్లా అధ్యక్షులు ఆరే రాకేశ్ రెడ్డి ,మాట్లాడుతూ సంఘాన్ని బలోపేతం చేస్తూ ముందుకు వెళ్లాలని జిల్లాలోని సమస్యలను నెరవేర్చడంలో వ్యవస్థాపక అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పిఆర్టియు సంఘం ముందుంటుందని అదేవిధంగా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉమాకర్ రెడ్డి ,పర్వతి సత్యనారాయణల సహకారంతో సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తూ నిరంతరం పాఠశాల,ఉపాధ్యాయుల అభివృద్ధికి అన్నివేళలా
పి ఆర్ టి యు తెలంగాణ సంఘం అండగా ఉంటుందని,317 జీ. ఓ సవరణతో ఉపాద్యాయుల కేటాయింపు,పాత పెన్షన్ పునరుద్ధరణ,టెట్ మింహాయింపు,ప్రమోషన్స్ తో కూడిన బదిలీలు, మొదలైన సమస్యలపై PRTU తెలంగాణ సంఘం పోరాడుతుందని తెలియజేశారు.కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆరే రాకేష్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి వెలిసొజు బుచ్చిరాములు,రాష్ట్ర బాద్యులు బిట్ల వేణు,కొన్నేటి దయాకర్,జిల్లా బాద్యులు నగేష్,చాగంటి ఆనంద్,రఫీ పాల్గొన్నారు.