అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు

అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు
ఙ్ఞాన తెలంగాణ, దామరగిద్ద ఏప్రిల్ 9:
నారాయణ పేట మండలం లోని బొమ్మాన్ పాడు గ్రామానికి చెందిన మహేష్ సింగ్ అక్రమంగా మద్యం తరలిస్తుండగా పోలిసులు పట్టుబట్టారు.నిల్వ ఉంచిన, బెల్టు షాపుల్లో అమ్మిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై కృష్ణదేవ్ తెలిపారు. అప్పంపల్లి చౌరస్తాలో టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్లు చెప్పారు. మొత్తం 15, 862 రూపాయల విలువ గల 36.05 లీటర్ల మద్యం సీజ్ చేశారు.రాబోయేఎన్నికల్లో భాగంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలిసులు హెచ్చరించారు.
ఇప్పటికే పలు చోట్ల తనీఖీలు చేపట్టామన్నారు.
కల్తీ మద్యం, అమ్మకాలు తయారు చేసిన వారికి కూడా ఇలాగే చర్యలు కొనసాగిస్తామని తెలిపారు.మహేష్ సింగ్ పై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.