మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలపై స్పందించిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలపై స్పందించిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
- ఫోన్ ట్యాపింగ్ మీద మంత్రి జూపల్లి కృష్ణారావు గారి వ్యాఖ్యలు చూస్తే నిజంగా నవ్వొస్తుందని వాక్య
- ట్యాపింగ్ బేసిక్స్ మీద కనీస అవగాహన లేదా అంటూ సెటైర్
- మీకు తెలియకుండా మీ ఫోను నుండి పొంగులేటి గారికి కాల్ ఎట్ల పోతది? అని ప్రశ్న
- మీకు తెలియని వ్యక్తి మీకు కాల్ చేయడమేంది? అని ప్రశ్న
- ట్యాపింగ్ ల కామెడీని బందు పెట్టి KCR గారి లాగా రైతన్నల దగ్గరికి వెళ్లి వారి కన్నీళ్లు తుడవండని సూచన
ఫోన్ ట్యాపింగ్ మీద మంత్రి జూపల్లి కృష్ణారావు గారి వ్యాఖ్యలు చూస్తే నిజంగా నవ్వొస్తుందాని X వేదికగా స్పందించారు .
ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఫోను సంభాషణను వాళ్లకు తెలియకుండా మూడవ వ్యక్తి లేదా సంస్థ విని రికార్డు చేస్తే దాన్ని ట్యాపింగ్ అంటరు మంత్రి గారు. మీకు ట్యాపింగ్ బేసిక్స్ మీద కనీస అవగాహన కూడా ఉన్నట్లు లేదు!
అసలు మీకు తెలియకుండా మీ ఫోను నుండి పొంగులేటి గారికి కాల్ ఎట్ల పోతది? నాకు తెలిసిన ఏ టాపింగ్ టెక్నాలజీ మీ ప్రమేయం లేకుండా మీ ఫోను నుండి రెండవ వ్యక్తికి కాల్ చేయదు. (వాళ్లకు ఈ ప్రాంక్ కాల్స్ అవసరం కూడా ఉండదు)
మీ అవుట్గోయింగ్ కాల్ లిస్టు వెరిఫై చేసుకున్నారా? పొంగులేటి గారి ఇన్కమింగ్ లిస్టులో ఉన్నది మీ నంబరేనా? మీ స్పీడ్/ ఎమర్జెన్సీ కాల్ లిస్టులో పొంగులేటి గారి నంబరున్నదేమో!!!
అసలు మీ ఫోను ఎప్పుడూ మీ దగ్గరే ఉంటదా? మీ ఫోను కు పాస్ కోడ్ ఉందా? ఆక్సిడెంటల్ గా ఫేస్టైం నొక్కారేమో మీరు?
రాత్రి అన్నారు కాబట్టి నిద్ర-‘మత్తులో’ పొంగులేటి గారికి నొక్కారేమో?
ఒక వేళ మత్తులో ఉంటే మీకు తెలిసే అవకాశమే లేదు.
మీకు తెలియని వ్యక్తి మీకు కాల్ చేయడమేంది? మీరు గట్టిగా అరవడమేంది? దీనికీ ట్యాపింగ్ కు సంబంధం ఏంది?
(మీ కంప్లైంట్ చూసి డీజీపి కడుపుబ్బ నవ్వుకొని ఉంటడు. ఆ కంప్లయింట్ మాతో కూడా షేర్ చేసుకోండి ప్లీజ్)
ఎందుకు సార్, సీనియర్ మంత్రైన మీరు పైనుండి వచ్చిన స్క్రిప్టును గుడ్డిగా చదివి అభాసుపాలవుతరు?
ఈ ప్రపంచంలో ట్యాపింగుకు హ్యాకింగ్ కు అతీతమైన టెక్నాలజీ ఏదీ లేదు.
స్మార్ట్ ఫోను కొని ఐ అగ్రీ అన్న బటన్స్ నొక్కిన రోజే మన ప్రైవసీ ఆవిరైపోయింది.
If you have time, please watch Edward Snowden in Netflix.
దయచేసి ఈ ట్యాపింగ్ ల కామెడీని ఇక మీ అందరు బందు పెట్టి #KCR గారి లాగా రైతన్నల దగ్గరికి వెళ్లండి. వాళ్ల కన్నీళ్లను తుడవండి. పోయిన పరువు కొంచెమన్నా దక్కుతుంది ఆని BRS నాగర్ కర్నూల్ ఎంపి అభ్యర్ధి డా “అర్ యస్ ప్రవీణ్ కుమార్ X వేదికగా స్పందించారు.