దూరదర్శన్ మాజీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి

దూరదర్శన్ మాజీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి
గుండె పోటుతో రెండు రోజులు ముందు హాస్పటిల్ లో జాయిన్ అయ్యారు.మలక్ పేటలోని యశోద ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచి పెట్టారు.సాయంత్రానికి మృత దేహాన్ని డీడీ కాలనీ తరలింపు శాంతి స్వరూప్ ప్రభుత్వ ప్రచార సాధన మైనా దూర దర్శన్ లో తొలి తెలుగు యాంకర్. అదే దూర దర్శన్ (టీవీ )లో తెలుగు ప్రజలకు వార్తలు చెప్పిన మొదటి వ్యక్తి.1978లో దూరదర్శన్ లో ఉద్యోగంలో చేరినా 1983 నవంబర్ 14 సాయంత్రం 7 గంటలకు శాంతి స్వరూప్ తొలి న్యూస్ బులెటిన్ ప్రారంభమైంది. 2011లో పదవీ విరమణ చేసిన వరకు కూడా ఆయన వార్తలు చదివే వాడు. ఇప్పుడు న్యూస్ రీడర్స్ గా గుర్తింపు తెచ్చిన వారందరికీ మొదట గురువు శాంతి స్వరూపనే..