TSRJC దరఖాస్తు గడువు పొడిగింపు

TSRJC దరఖాస్తు గడువు పొడిగింపు
జ్ఞాన తెలంగాణ బ్యూరో: టీఎస్ ఆర్జేసీ దరఖాస్తు గడవును పొడగించినట్లు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సీహెచ్ రమణకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు
తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం(ఇంగ్లిష్ మీడియం ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ)లో ప్రవేశాలకు గాను దరఖాస్తులు ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. తెలంగాణలోని 33 జిల్లాల విద్యార్థుల నుంచి దీనికి దరఖాస్తు చేసుకోవచ్చని, http://tsrjdc.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ చేయాల్సి ఉంటుందన్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల కోరిక మేరకు, విద్యార్థుల సౌకర్యార్థం ఈ దరఖాస్తుల స్వీకరణను ఈనెల 31వ తేదీ వరకు పొడగించినట్లు స్పష్టంచేశారు. కాగా శుక్రవారం నాటికి సుమారు 60 వేల మంది నుంచి అప్లికేషన్లు స్వీకరించినట్లు తెలిపారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్ష రాస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన వెల్లడించారు*