బీఎస్పీ-బీఆర్ఎస్ మ‌ధ్య కుదిరిన పొత్తు

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీఎస్పీ-బీఆర్ఎస్ మ‌ధ్య కుదిరిన పొత్తు

  • పోటీ చేసే స్థానాలపై త్వరలో స్పష్టత
  • మీడియా సమావేశంలో సంయుక్తంగా వెల్లడించిన ఆర్ఎస్పీ,కేసీఆర్.

లోకసభ ఎన్నిక‌ల్లో బీఎస్పీ-బీఆర్ఎస్ మ‌ధ్య కుదిరిన పొత్తు మీడియా సమావేశంలో సంయుక్తంగా వెల్లడించిన ఆర్ఎస్పీ,కేసీఆర్జ‌ త్వరలో ర‌గ‌బోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీఎస్పీ -బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య పొత్తు కుదిరినట్లు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు లు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు.ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పొత్తులపై చర్చలు జరిపారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఎస్పీ, బీఆర్ఎస్‌ పార్టీలు క‌లిసి పోటీ చేయాల‌ని సంయుక్తంగా నిర్ణ‌యించారు. బీఎస్పీ- బీఆర్ఎస్ పార్టీలు పోటీ చేసే స్థానాలపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్లు వారు సంయుక్తంగా ప్రకటించారు.

You may also like...

Translate »