యువతి మిస్సింగ్ కేసు నమోదు చేసిన మొయినాబాద్ పోలీసులు

యువతి మిస్సింగ్ కేసు నమోదు చేసిన మొయినాబాద్ పోలీసులు

చేవెళ్ల, జ్ఞాన తెలంగాణ: మొయినాబాద్ మండలంలో నివాసముంటున్న కర్ణాటక రాష్ట్రం, గుల్బర్గా జిల్లా, మండలం ముందొల్, గోపన్ పల్లి గ్రామానికి చెందిన బాయికాడి భగవత్ గత కొన్ని సంవత్సరాల నుంచి మొయినాబాద్ లో నివాసమంటూ రోజువారి కూలీగా జీవనం సాగిస్తున్నారు భగవత్ కు అనురాధ అనే కూతురు ఉన్నది తను ఒక ప్రైవేట్ ఆఫసులో హౌస్ కీపింగ్ గా పనిచేస్తూ ఉండేది గత నేల 29/01/2024 నాడు జీతం తీసుకోని వస్తానని ఇంట్లో చెప్పి వెళ్ళింది తర్వత రాలేదు ఆఫీసులో అడగగా 29/01/2024 నాడు నైట్ ఆఫీసులోనే ఉండి 30/01/2024 తారీకు వెళ్ళిపోయినట్టు ఆఫీస్ వారు తెలిపారు.

అప్పటినుంచి తన బంధువుల దగ్గర కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ వెతికారు కానీ ఫలితం లేకపోయింది దానితో ఈరోజు తన తండ్రి బాయికాడి భగవత్ మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయి మిస్సయిన రోజు బ్లూ కలర్ టాప్ వేసుకున్నట్టు అలాగే తనకు తెలుగు, కన్నడ భాషలు తెలుసునన్ని తన మొబైల్ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నట్లు తన తండ్రి కంప్లైంట్ లో రాయడం జరిగింది…

You may also like...

Translate »