మేడారం జాతరకు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం

మేడారం జాతరకు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం
మేడారం ట్రస్ట్ బోర్డు నూతన కమిటీతో కలిసి సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క
మేడారం ట్రస్ట్ బోర్డు కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు ఈ రోజు మేడారం లో నూతనంగా ఏర్పాటైన మేడారం ట్రస్ట్ బోర్డు నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారుఈ సందర్భంగా మాట్లాడుతూ మేడారం జాతర కు వచ్చే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేసిందని గత నెలరోజులుగా భక్తులు లక్షలాదిగా తల్లులను దర్శించుకోవడానికి వస్తున్నారని జాతర సమీపిస్తున్న నేపథ్యంలో మా అధికారులు అన్ని విధాలుగా సిద్దంగా ఉన్నారని నూతన కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్లు అందరినీ సమన్వయము చేసుకొని జాతర విజయవంతం చేయాలి అని చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ఆర్రెం లచ్చు పటేల్ తో పాటు డైరెక్టర్లకు శుభా కాంక్షలు తెలిపిన రాష్ట్ర మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క గారుఈ కార్యక్రమంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధ బోయిన జగ్గారావు తో పాటు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు