పిబ్రవరి 16న దేశ వ్యాప్త కార్మికుల సమ్మె , గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయండి

పిబ్రవరి 16న దేశ వ్యాప్త కార్మికుల సమ్మె , గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయండి

జ్ఞానతెలంగాణ – బోధన్పిబ్రవరి 16న దేశ వ్యాప్తంగా నిర్వహించే కార్మికుల సమ్మెను, గ్రామీణ భారత్ బంద్ ను విజయవంతం చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు వరదయ్య అన్నారు.శనివారం బోధన్ పట్టణంలో పార్టీ కార్యాలయంలో పిబ్రవరి 16 సమ్మె గోడ ప్రతులు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్పోరేట్ -మతతత్వ విధానాలను ప్రతిఘటించాలని పిలుపు ఇచ్చారు. మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను, సహజ వనరులను కార్పోరేట్ పరం చేస్తున్నారని విమర్శించారు. సింగరేణిని,ఎల్ఐసి ని ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను రద్దు చేసి 4 లేబర్ కోడ్ లను తీసుకువచ్చిందని అన్నారు. సమ్మె హక్కును కాలరాస్తున్నదని పిఎఫ్, ఇఎస్ ఐ వెల్పేర్ బోర్డులను నిర్వీర్యం చేస్తుందని, 12గంటల పని విధానం అమలులోకి తీసుకు వస్తుందని అన్నారు.

కాంట్రాక్టు లేబర్ విధానం అన్ని రంగాల్లో మరింత పెంచి శ్రమ దోపిడీకి గురి చేస్తుంది అని ఆరోపించారు. కనీసవేతనం 26,000/ రూపాయలు ఇవ్వడానికి బిజెపి ప్రభుత్వం అంగీకరించట్లేదని అన్నారు. 2014 స్వామినాథన్ కమీషన్ సిఫార్సుల ప్రకారం కనీస మద్దతు ధర కల్పించడం లేదని అన్నారు. భారత రాజ్యాంగాన్ని అందులో పోందుపరచిన లౌకిక వాదాన్ని తారుమారు చేస్తూ హిందూ రాజ్య స్థాపన లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ ఎజెండాను ముందుకు తీసుకుపోతుందని విమర్శించారు. దేశ సంపదను స్వదేశీ,విదేశి దోపిడీ దారులకు అప్పచెబుతున్నదన్నారు. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనగా జరిగే పిబ్రవరి 16 దేశ వ్యాప్త సమ్మె ను కార్మికులు, రైతులు ,ప్రజలు జయప్రదం చేయాలని వరదయ్య పిలుపు ఇచ్చారు ఈ కార్యక్రమంలో IF నాయకులు సురేష్, సాయాగౌడ్, పేట సాయిలు, నజీర్ తదితరులు పాల్గొన్నారు.దళిత

You may also like...

Translate »