అంగన్‌వాడీలు, ఆశాలతో రూ.500 వంటగ్యాస్ దరఖాస్తుల పరిశీలనమొబైల్‌యాప్‌లో వివరాల నమోదు

అంగన్‌వాడీలు, ఆశాలతో రూ.500 వంటగ్యాస్ దరఖాస్తుల పరిశీలనమొబైల్‌యాప్‌లో వివరాల నమోదు
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లోని మహాలక్ష్మిలో ఒకటైన రూ.500కు వంటగ్యాస్ సిలిండర్ అందజేత పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తల ద్వారా క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుల వివరాలను మొబైల్ యాప్‌లో నమోదు చేయించాలని నిర్ణయించింది. ప్రతి కార్యకర్త 30 దరఖాస్తులను ఇంటింటికీ తీసుకువెళ్లి రేషన్‌కార్డు, ఎల్‌పీజీ కంపెనీ పేరు, వినియోగదారు నంబర్, పాస్‌బుక్ సంఖ్య, డెలివరీ రసీదు నంబరు పరిశీలిస్తారు.
అర్హతలున్నాయనుకుంటే తెల్ల రేషన్‌కార్డు, ఎల్‌పీజీ కంపెనీ పేరు, వినియోగదారు సంఖ్య యాప్‌లో నమోదు చేస్తారు. మొబైల్‌యాప్ బుధవారం అన్ని జిల్లాలకు పంపిస్తారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, మండలస్థాయిలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, జిల్లాస్థాయిలో కలెక్టర్లు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తారు. రాష్ట్రస్థాయిలో రెవెన్యూ కార్యదర్శి, పౌరసరఫరాలు, జీహెచ్‌ఎంసీ కమిషనర్లు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్ పరిశీలిస్తారు.