నవీన్ నికోలస్ ను గురుకులాల సెక్రటరీగా కొనసాగించాలి.

నవీన్ నికోలస్ ను గురుకులాల సెక్రటరీగా కొనసాగించాలి.
– గురుకులాల తల్లిదండ్రుల డిమాండ్.
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: బలహీనవర్గాల బిడ్డలు గురుకులాల్లో చదువుకోవడం ఉన్నత చేయాలతో ముందుకు సాగడం, ఆకాశమే హద్దుగా దూసుకు పోయేటటువంటి గొప్ప సంకల్పాన్ని ఇచ్చినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాజీనామా చేసిన తర్వాత, కొంతకాలం రోనాల్డ్ రోస్ గారు గురుకులాల సెక్రటరీగా ఉన్నారు, అస్తవ్యస్తంగా ఉన్న గురుకులాలను సక్రమ పరిచే మార్గంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నప్పుడు పనిచేసిన నవీన్ నికోలస్ గారిని గురుకులాల సెక్రటరీగా నియమించి గురుకులాల వ్యవస్థలో కొంత పూర్వ వైభవానికి దారితీస్తున్న తరుణంలో వారిని పదవి నుంచి తొలగించడం అంటే బలహీనవర్గాల నోట్లో మట్టి కొట్టినట్టే.పూర్తి అడ్మినిస్ట్రేషన్ చూసి పేద బిడ్డల బాగోగులు చూసే మంచి సెక్రటరీని తొలగించడం గురుకులాల తల్లిదండ్రులుగా మేము అంగీకరించమని ప్రతి శీల తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నవీన్ ని కులస్ గారిని గురుకులాల సెక్రెటరీగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.