‘నంది’ని గద్దర్ అవార్డులుగా మార్చడం సముచితం: చిరంజీవి

‘నంది’ని గద్దర్ అవార్డులుగా మార్చడం సముచితం: చిరంజీవి
ఎక్కడ కళాకారులను గౌరవిస్తారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని సినీ నటుడు చిరంజీవి అన్నారు. పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. శిల్పకళావేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.అభిమానుల ఆశీర్వాదాలు చూస్తుంటే తన జన్మ ధన్యమైందని అనిపిస్తోంది. పురస్కారాలు ప్రకటించిన వెంటనే సన్మానం చేయాలనే ఆలోచన ఇంతవరకు ఎవరికీ రాలేదు.కొన్నేళ్లుగా నంది అవార్డులను నిలిపివేయడం నిరుత్సాహపరిచింది.వాటిని గద్దర్ అవార్డులుగా మార్చడం ఎంతో సముచితం, ఆనందం అని చెప్పారు.