స్వర్ణ పతకాలతో మెరిసిన శంకర్ పల్లి పోలీసులు

స్వర్ణ పతకాలతో మెరిసిన శంకర్ పల్లి పోలీసులు
వార్షిక క్రీడోత్సవాలలో భాగంగా (2024) మూడు బంగారు పతకాలు సాధించి, తమ ప్రతిభ చాటుకున్న శంకర్ పల్లి పోలీస్ స్టాప్. శంకర్ పల్లి సీఐ వినాయక్ రెడ్డి బంగారు పతకం సాధించడంతో హర్షం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు జ్ఞాన తెలంగాణ ( శంకర్ పల్లి) సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న 2024 వార్షిక స్పోర్ట్స్ మీట్ లో భాగంగా, రాజేంద్ర నగర్ జోన్ కు చెందిన శంకర్ పల్లి పోలీసులు, తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి, మూడు బంగారు పతకాలు సాధించారు,

ఈ పతకాలు సాధించిన వారి లో, శంకర్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ శేఖర్, కానిస్టేబుల్ నాగభూషణం ఉన్నారు. తన స్టాప్ కు స్ఫూర్తిగా నిలుస్తూ…, శంకర్ పల్లి సీఐ వినాయక్ రెడ్డి, బంగారు పతకం సాధించడంతో , మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు, బాస్ సిఐ గారిని అనుసరిస్తూ, మరో రెండు పతకాలు సాధించిన హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ కు శంకర్ పల్లి మండల ప్రజలు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ యొక్క ఈవెంట్స్ కి కెప్టెన్ గా…., డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నాగరాజు వ్యవహరించారు, పతకాలు సాధించిన వారిని డిసిపి రేష్మ పెరుమాళ్ అభినందించారు.

