పొన్నాల చౌరస్తా దగ్గర ఉన్న వైన్స్ తొలగించాలి : బీఎస్పీ డిమాండ్

పొన్నాల చౌరస్తా దగ్గర ఉన్న వైన్స్ తొలగించాలి : బీఎస్పీ డిమాండ్

సిద్దిపేట అర్బన్ 03, శనివారంబహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సిద్దిపేట పట్టణం లోని ఎక్సైజ్ కార్యాలయంలో సిఐ ఆకుల శ్రీనివాస్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ పొన్నాల చౌరస్తా దగ్గర ఉన్నటువంటి వైన్స్ రాష్ట్ర రహదారికి కనీసం 10 మీటర్లు దూరం లేకున్నా పర్మిషన్ ఇచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇప్పటివరకు దాదాపు నలుగురు వైన్స్ ఎదురుగా ప్రాణాలు కోల్పోయిన అధికారులు పట్టించుకోకుండా, చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. తక్షణమే వైన్స్ ను తొలగించాలని బిఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు నిబంధనలను బేఖాతారూ చేస్తూ రోడ్డుకు కనీసం 240 మీటర్లు దూరం లేకుండా పరిమిషన్ ఇవ్వడం దేనికి నిదర్శనం.15 రోజులు లా లోగా అట్టి వైన్సులను తొలగించాలని బిఎస్పి నాయకులు అల్టిమేటం జారీ చేశారు. కార్యక్రమంలోనాయకులు జిల్లా ఇన్చార్జి రోమాల బాబు, అసెంబ్లీ ఇంచార్జ్ బాకురి అశోక్, అసెంబ్లీ అధ్యక్షుడు పుల్లూరు ఉమేశ్, ప్రధాన కార్యదర్శి మల్లేశం ముదిరాజ్, రూరల్ మండల అధ్యక్షుడు హరికిరాన్, రాజు, కీర్తి కుమార్.

You may also like...

Translate »