నేను బ్రతికే ఉన్నా : మోడల్ పూనమ్.

నేను బ్రతికే ఉన్నా : మోడల్ పూనమ్.
హైదరాబాద్:ఫిబ్రవరి 03అందరు అనుకున్నట్లే అయింది. ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండే చనిపోలేదు. బతికే ఉంది. ఈ విషయాన్ని కొద్దిసేపటి క్రితం ఆమె స్వయంగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.సర్వైకల్ కాన్సర్ పై చైతన్యం కలిగించేందుకే తాను ఇలా చేసినట్లు ఆమె తెలిపారు. సర్వైకల్ కాన్సర్ పై అవగాహన కల్పించేందుకు ఏదో ఒకటి విభిన్నంగా చేయానుకున్నాను.అందుకే నేను చనిపోయి నట్లు ప్రచారం చేశాను. నిజానికి నేను బాగానే ఉన్నాను. సర్వైకల్ కాన్సర్ కు బలి కాలేదు” అంటూ పూనమ్ పేర్కొంది.పూనమ్ పాండే గురువారం కన్నుమూసినట్లు సోషల్ మీడియాలో ప్రచారమైన సంగతి తెలిసిందే. మూడు రోజులక్రితం ఒక పార్టీకి వెళ్లినట్లు స్వయంగా వీడియో పోస్ట్ చేసిన పూనమ్..అంతలోనే ఎలా చనిపోతుందంటూ చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు.