మండల స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్

మండల స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్
స్థానిక జఫర్గడ్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల నందు తేదీ:1- 2- 2024 రోజున మండల స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది.
TSSTF తెలంగాణ సోషల్ స్టడీస్ టీచర్స్ ఫోరం* రాష్ట్ర నిర్వాహకులు గడ్డమీది రతంగపాణి జిల్లా సమన్వయులు డాక్టర్ సుభాష్ గారి సూచనల మేరకు TSSTF జఫర్గడ్ మండల కో-ఆర్డినేటర్ రీచవేని కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో సోషల్ టాలెంట్ టెస్ట్ 2024 విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈ టాలెంట్ టెస్ట్ విజేతలుగా ప్రథమ స్థానంలో డి షణ్ముఖప్రియ ద్వితీయ స్థానంలో ఆర్ శ్రీనిత లు TS మోడల్ స్కూల్ విద్యార్థులు కాగా తృతీయ స్థానంలో పి .గౌతమి ZPHS కోనూరు విద్యార్థులు గెలుచుకున్నారు. బహుమతులు పొందిన విద్యార్థులు 3 -2- 2024 రోజున జిల్లాస్థాయి పోటీలలో జనగామ నందు పాల్గొనవలసి ఉందని ప్రిన్సిపాల్ డి. శ్రీకాంత్ గారు తెలియజేశారు ఈ సందర్భంగా వివిధ గ్రామాల పాఠశాల నుండి వచ్చిన విద్యార్థులు మరియు ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ఈనెల 22 వరకు మోడల్ స్కూలు ఆరవ (6) తరగతి అప్లికేషన్ సమయం/ టైం ఉన్నదని తెలియజేశారు. తమ తమ గ్రామాల్లో ఐదవ(5) తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు మోడల్ స్కూల్లో అడ్మిషన్ పొందే అవకాశం ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు డాక్టర్ జానీ నాయక్, వెంకట్, శశి కుమారి గార్లు పాల్గొని విజయవంతం చేశారు.ప్రిన్సిపాల్మోడల్ స్కుాల్ , జఫర్ గడ్.