కరీంనగర్ నుంచే బీజేపీ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం: బండి సంజయ్

కరీంనగర్ నుంచే బీజేపీ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరిస్తామని బీజేపీ ఎంపీ బండి సంజయ్ తెలిపారు.కరీంనగర్లో మాట్లాడుతూ ఈనెల 28న 20 వేల మందితో బీజేపీ కార్యకర్తల సమ్మేళనం నిర్వహించనున్నట్లు, దానికి కేంద్రమంత్రి అమిత్ షా హాజరవుతారని చెప్పారు. వచ్చేనెల 5 నుంచి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పాదయాత్ర చేస్తానన్నారు. గవర్నర్ వ్యవస్థను కించపర్చిన చరిత్ర కేసీఆర్ కుటుంబానిదేనని విమర్శించారు.