కాటేదాన్ ఇండ‌స్ట్రీ ఏరియాలో భారీ అగ్ని ప్ర‌మాదం.

కాటేదాన్ ఇండ‌స్ట్రీ ఏరియాలో భారీ అగ్ని ప్ర‌మాదం.

రంగారెడ్డి జనవరి 17: రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడ‌లో ఇవ్వాల‌ బుధ‌వారం తెల్ల‌వారుజామున భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది.నేతాజీ న‌గ‌ర్‌లోని ఏషియ‌న్ బ్యార‌ల్స్ డ్ర‌మ్ముల త‌యారీ కంపెనీలో మంట‌లు చెల‌రేగాయి కంపెనీలో అగ్నికీల‌లు ఎగిసిప‌డ‌టంతో ఆ ప్రాంతంలో పొగ‌లు ద‌ట్టంగా అలుముకున్నాయి.

స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేశారు షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగా మంట‌లు చెల‌రేగిన‌ట్లు తెలుస్తోంది.ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు అగ్నిప్ర‌మాదం కార‌ణంగా స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.

You may also like...

Translate »