శ్రీరామనవమి శోభా యాత్రను నిర్వహిస్తే కాల్చి చంపుతామంటూ…ఎమ్మెల్యే రాజాసింగ్ కు మళ్ళీ బెదిరింపులు

శ్రీరామనవమి శోభా యాత్రను నిర్వహిస్తే కాల్చి చంపుతామంటూ…ఎమ్మెల్యే రాజాసింగ్ కు మళ్ళీ బెదిరింపులు

మాట వినకుండా శ్రీరామనవమి శోభా యాత్రను నిర్వహిస్తే నువ్వు నా కొడుకును గన్ తో కాల్చి చంపుతామని బెదిరింపు.తనను కాపాడాలంటూ డీజీపీకి లేఖ…గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. శ్రీరామనవమి శోభా యాత్రను నిర్వహిస్తే కాల్చి చంపుతామంటూ రాజాసింగ్ కు గత కొన్ని రోజులుగా వేర్వేరు నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ డీజీపీకి లేఖ రాశారు.గోషామహల్ బీజేపీ (BJP) ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. రాజాసింగ్ ను గన్ తో కాల్చి చంపేస్తానంటూ ఓ వ్యక్తి కాల్ చేశాడు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ రావడం ఇదేమి కొత్త కాదు. గతంలో కూడా రాజాసింగ్ కు చాలానే బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇందుకు కారణం రాజాసింగ్ హిందూ మతంపై ఉన్నప్రేమతో ఇతర మతాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఈ పరిస్తితి కి కారణం అని అంటున్నారు నెటిజన్లు.

డీజీపీకి లేఖ…

తనకు మళ్ళీ మళ్ళీ బెదిరింపు కాల్స్ రావడంపై తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు ఎమ్మెల్యే రాజాసింగ్. గత కొన్ని రోజులుగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. శ్రీరామనవమి శోభా యాత్రను నిర్వహించవద్దని కాల్స్ చేసి బేరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ వారు చెప్పింది వినకుండా శ్రీరామనవమి శోభా యాత్రను నిర్వహిస్తే తన కుమారుడిని కిడ్నప్ చేసి.. తనతో పాటు తన కొడుకుని గన్ తో కాల్చి చంపుతామంటూ గత కొన్ని రోజులుగా కొత్త నెంబర్లతో కొందరు బెదిరిస్తున్నట్లు డీజీపీ కి రాసిన లేఖలో పేర్కొన్నారు. దీనిపై స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీని కోరారు.

You may also like...

Translate »