పురుగుల అన్నం పెడుతున్నారని జేఎన్టీయూ విద్యార్థుల ధర్నా.

పురుగుల అన్నం పెడుతున్నారని జేఎన్టీయూ విద్యార్థుల ధర్నా.
హైదరాబాద్ జనవరి 05: హైదరాబాద్ జేఎన్‌టీయూ కాలేజీ మెస్‌లో ఆహారం సరిగా లేదని విద్యార్థినులు ధర్నాకు దిగారు వర్శిటీ గేటు వద్ద బైఠాయించి ప్రిన్సిపాల్ కు వ్యతిరేకంగా నినాదాల చేశారు.ఈ సందర్భంగా జేఎన్ టీయూ పీజీ విద్యార్థులు మాట్లాడుతూ తినే ఆహారంలో పురుగులు బొద్దింకలు వైర్లు గాజు ముక్కలు వస్తున్నాయని ఆరోపించారు కళాశాలకు కొత్త ప్రిన్సిపాల్ వచ్చినప్పటి నుంచి భోజనం సక్రమంగా అందడంలేదని మండి పడ్డారు.విద్యార్థుల సమస్యలపై పలుమార్లు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించు కోవడంలేదని వాపోయారు ఫిర్యాదు చేసిన వారిపైనే ప్రిన్సిపాల్ దాడులు చేస్తున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
న్యాయం కోసం వెళితే సాయంత్రం 6 గంటల లోపు మెస్ తలుపులు మూసేస్తామని ప్రిన్సిపాల్ బెదిరిస్తున్నారని విద్యార్థులు విమర్శిస్తున్నారు తక్షణం తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.విద్యార్థులు ఎక్కడికి వెళ్లినా ఎందుకు వెళ్తున్నారు కాలేజీలో ఎక్కడపడితే అక్కడ కూర్చోవడం దేనికి అని అడుగుతున్నారని అన్నారు హాస్టల్ మెస్ సరిగా లేదని మెస్‌లోనే లైటింగ్ లేక చీకట్లో భోజనం చేయాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నారు.ఎక్కువ మాట్లాడితే హాస్టల్ ఖాళీ చేయిస్తానని ప్రిన్సిపాల్ బెదిరిస్తున్నాడని విద్యార్థులు వాపోయారు.