అంధులకు అక్షరాన్నిచ్చిన మహనీయులు శ్రీ లూయీస్ బ్రెయిలీ గారి జయంతి.

భౌతిక శాస్ర్రవేత్త సర్ ఐజక్ న్యూటన్ గారి సేవలు చిరస్మరణీయం

అంధులకు అక్షరాన్నిచ్చిన మహనీయులుఅంధులకు అక్షరాన్నిచ్చిన మహనీయులు శ్రీ లూయీస్ బ్రెయిలీ గారి జయంతు లూయీస్ బ్రెయిలీ గారి సేవలు చిరస్మరణీయం

సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి

జ్యోతి హై స్కూల్ కరస్పాండెంట్ వి. వెంకటరామయ్య

జనవరి 4 న భౌతిక శాస్ర్రవేత్త సర్ ఐజక్ న్యూటన్ జయంతి

జనవరి 4న అంధులకు అక్షరాన్నిచ్చిన మహనీయులు శ్రీ లూయీస్ బ్రెయిలీ గారి జయంతి సందర్బంగా

డోన్ పట్టణం లోని జ్యోతి హై స్కూల్ నందు సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యం లో జ్యోతి హై స్కూల్ కరస్పాండెంట్ వి. వెంకటరామయ్య అధ్యక్షతన సర్ ఐజక్ న్యూటన్ జయంతి మరియు జనవరి 4 న అంధులకు అక్షరాన్నిచ్చిన మహనీయులు శ్రీ లూయీస్ బ్రెయిలీ గారి జయంతులు పురస్కరించుకొని వారి చిత్ర పటాలకు పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు. వారిని స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి ఉమామహేశ్వరి ,జి సురేష్ ,వి శ్రీనివాసులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారుఈ సందర్బంగా జ్యోతి హై స్కూల్ కరస్పాండెంట్ వి. వెంకటరామయ్య, సామాజిక కార్యకర్త పి.మహమ్మద్ రఫి మాట్లాడుతూ *మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి పేర్కొన్నారు*1) ప్రపంచం గర్వించదగ్గ ప్రముఖ శాస్త్రవేత్తలలో సర్‌ ఐజక్‌ న్యూటన్‌ ఒకరు.ఆయన పేరు చెప్పగానే వెంటనే స్పురణకు వచ్చేది భూమ్యాకర్షణ శక్తి. తోటలో కూర్చుని ఉండగా ఒక ఆపిల్‌ పండు చెట్టుమీద నుంచి నేలమీదికి రాలి పడింది. ఈ దృశ్యం ఎందుచేతనో న్యూటన్‌ మహాశయుని ఆకర్షించడమే కాదు, ఆలోచనలో పడేసింది. ఆపిల్‌పండు నేలమీదకే కింది వైపుగానే ఎందుకు రాలిపడాలి? పైకి ఎందుకు పోకూడదు? దీనికి కారణం ఏమిటి? కుడివైపుగాని, ఎడమవైపుగాని ఎందుకు పడలేదు అనే ప్రశ్నలు ఆయనను చుట్టుముట్టాయి. రాలి పడిన పండే కాదు, గాల్లోకి విసిరిన అన్ని వస్తువులు భూమివైపుకే ఎందుకు తిరిగి రావాలి? భూమికి ఉన్న శక్తి ఏమిటి? అని వేధించసాగాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే భూమ్యాకర్షణ సిద్ధాంతం. భూమికే కాదు, గ్రహం, నక్షత్రం, ఇలాంటి వాటికి కూడా పరస్పర ఆకర్షించుకునే శక్తులు ఉంటాయని ఊహించాడు. ఈ ఊహే ‘విశ్వగురుత్వాకర్షణ సిద్ధాంతం’ అయింది. ఈ సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వంలోని ప్రతీ వస్తువు, మరో వస్తువును ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షణ ఆయా వస్తువుల ద్రవ్యరాశిని బట్టి పెరుగుతూ ఉంటుంది. ఆయా వస్తువుల మధ్యగల దూరాన్ని బట్టి తగ్గుతూ ఉంటుంది అని కనిపెట్టాడు. గణితం ప్రొఫెసర్‌ శ్రీ ఐజక్‌ బారౌ తో న్యూటన్‌ పనిచేయసాగాడు. న్యూటన్‌లో దాగివున్న అసాధారణ మైన మేధాసంపత్తిని గుర్తించి న్యూటన్‌కు 27ఏండ్లు ఉన్నప్పుడు బారౌ తన ప్రొఫెసర్‌ షిప్‌ను అప్పగించాడు. గణితంలో వీరి ప్రతిభకు గుర్తింపుగా ఆయనను ‘ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటీ’గా ఎన్నుకున్నారు. సూర్యకాంతిలో ఏడు రంగులు ఉన్నాయని, ఆ ఏడురంగులు కలిస్తే మళ్ళీ ధవళకాంతి వస్తుందని న్యూటన్‌ ప్రయోగపూర్వకంగా నిరూపించాడు.

భౌతిక, గణిత శాస్త్రాలకు సరికొత్త జవసత్వాలను అందించిన ఘనత కూడా న్యూటన్‌ మహాశయునికి దక్కుతుంది. కాంతి మీద ఆయన చేసిన పరిశోధనలు ”ఆప్టిక్స్‌” పేరిట, మిగతా పరిశోధనలు ‘ప్రిన్సిపియా’ పేరిట పుస్తకాలుగా వెలువడ్డాయి. వృద్ధాప్యం మీద పడినా తన పరిశోధనలు ఆపలేదు. నేటి తరం శాస్త్రవేత్తలు, విద్యార్థులు న్యూటన్‌ గారి ని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్ధులు పరిశోధనలు చేసి సమాజానికి సేవ చెయ్యాలని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి జ్యోతి హై స్కూల్ కరస్పాండెంట్ వి .వెంకటరామయ్య కోరారు.2) ఫ్రెంచ్ విద్యావేత్త ప్రపంచ అంధులకు అక్షర జ్ఞానాన్ని ప్రసాదించిన మహనీయుడు శ్రీ లూయీ బ్రెయిలీ జనవరి 4, 1809 జన్మించారు.అంధులకు అక్షరాన్నిచ్చిన మహనీయులు ప్రపంచవ్యాప్తంగా అంధులు సైతం విద్య ద్వారా సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఏకైక లక్ష్యంతో లూయిస్ అంధుల కొరకు లిపిని కనిపెట్టారు. కనుకనే ఆయన పేరు మీదగా బ్రెయిలీ లిపి అని పేరు వచ్చింది. అంధుల విద్య ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఈ లిపిలోనే కొనసాగుతుంది.

ప్రపంచవ్యాప్తంగా అనేక కోట్ల మంది అంధుల కోసం లిపిని కనిపెట్టి వారి జీవితాల్లో అక్షరజ్ఞానం కలిగించిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ. బాల్యంలో ప్రమాదవశాత్తు రెండు కళ్ళను కోల్పోయి తన 4వ ఏట పూర్తిగా గుడ్డి వాడయ్యాడు. ప్యారిస్‌లో వాలెంటైన్‌ హ్యూ ప్రారంభించిన అంధుల పాఠశాలకు బ్రెయిల్‌ చదువు కోవడానికి వెళ్ళాడు. బ్రెయిల్‌ అసాధారణ ప్రతిభ సామర్థ్యాలు గల వ్యక్తిగా రాణించి, అప్పటికి అమలులో ఉన్న “లైన్ టైపు” పద్ధతిలో చదువుకుని అదే స్కూలులో ప్రొఫెసరుగా నియమించబడ్డాడు.అంధుల లిపి కోసం అహర్నిశలు కృషి చెసిన మహనుభావులు. పదాలను, అంకెలను, సంగీత చిహ్నాలను రూపొందించాడు.ఈ నిరంతర శ్రమవల్ల క్షయవ్యాధికి గురై 1852 జనవరి 6 న మరణించాడు. బ్రెయిలీ శిష్యులు తమ గురువు గారు రూపొందించిన లిపికి గుర్తింపునివ్వాలని పోరాటం చేయగా అతని లిపికి అధికార గుర్తింపునిచ్చింది. ఈ రోజు ప్రపంచ అంధులకు అన్ని రకాల పుస్తకాలు, పత్రికలు ఆ లిపిలోనే వస్తున్నాయి. అందుకే అంధుల మనసుల్లో, వారి మునివేళ్లలో చిరకాలం జీవిస్తూనే ఉంటాడు బ్రెయిలీ గారు. ఇటువంటి మహానుభావులను స్మరించుకోవాలని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి జ్యోతి హై స్కూల్ నందు స్కూల్ కరస్పాండెంట్ వి వెంకటరామయ్య కోరారు అలాగే సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి విద్యార్థులకు కాలుష్యం పై మరియు ఆరోగ్యం పై అవగాహణ కలిపించారు. ఆరోగ్యం పై జాగ్రత్తగా ఉండాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని , తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ముక్కు,నోటికి చేతిరుమాలు అడ్డం పెట్టుకోవాలని,నీళ్ళు శరీరానికి తగ్గట్టుగా త్రాగాలని, ముఖ్యంగా పిల్లలు జంక్ ఫుడ్ తినరాదని, తగిన సమయం నిద్రపోవాలని, బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి వేయకూడదని, జ్వరం వచ్చిందంటే ప్రభుత్వ వైద్యశాలలో వైద్యనిపుణులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని తెలిపారు. విద్యార్థి దశ నుండి క్రమశిక్షణ అలవర్చుకొని మన దేశ భారతీయ సాంస్కృతి సాంప్రదాయాలను పాటించి దేశాభివృద్ధికి తోడ్పడాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారు.

You may also like...

Translate »