సావిత్రిబాయి పూలే ఆశయాలను సాధిద్దాం.__ ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం

సావిత్రిబాయి పూలే ఆశయాలను సాధిద్దాం.__ ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం

చేవెళ్ల, జ్ఞాన తెలంగాణ జనవరి 03 ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేవెళ్ల పట్టణ కేంద్రంలోని బాలికల పాఠశాలలో గల సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి జయంతిని ఘనంగా నిర్వహించాము. అనంతరం ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మాట్లాడుతూ భారతదేశపు తొలి ఉపాధ్యాయురాలు, సంఘసంస్కర్త, రచయిత్రి, అంటరాని ప్రజలకు విద్యను అందించిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అన్నారు. సమాజంలోని అంటరానితనానికి, అణచివేతకు, దోపిడి గురైన ప్రజలకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యను అందించారన్నారు. వెనుకబడిన మరియు అంటరాని ప్రజల విద్యను అందించడం కోసం ఎన్నో త్యాగాలు,పోరాటాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి మహేష్, జిల్లా అధ్యక్షులు బేగరి ప్రభాకర్, జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణ ప్రసాద్, జిల్లా కోశాధికారి యంజాల వినోద్, చేవెళ్ల మండల అధ్యక్షులు మల్లెపల్లి శ్రీనివాస్, షాబాద్ మండల అధ్యక్షుడు సిరిసాల సత్యనారాయణ, రాజు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »