తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.
బాగ్ లింగంపల్లి, జ్ఞాన తెలంగాణ : డిసెంబర్ 29ఉద్యమకారులఫోరం తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం, సంక్షేమం కోసంరాష్ట్ర కమిటి చైర్మన్ చీమ శ్రీనివాస్ అద్వర్యంలో రౌండ్ టెబుల్ సమావేశంశుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో ఏర్పటు చేసారు. తెలంగాణ ఉద్యమకారులకి ఇచ్చిన హామీలను నెరవేర్చటానికి వెంటనే కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని అన్నారు. తెలంగాణ అమరవీరులకి, ఉద్యమకారులకి 250 గజాల ఇంటి స్థలాన్ని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలుపుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులందరికి వారి ఆర్థిక పరిస్థితిని బట్టి 250 గజాల ఇంటి స్థలము ఇచ్చే విదంగా చూడాలని ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు. కేవలం పోలీసు కేసుల ఆధారంగానే గుర్తిస్తామంటే ఉద్యమం చేసిన అనేకమంది ఉద్యమకారులని విస్మరించినట్లు అవుతుంది. లబ్ది చేకూరదు. ప్రభుత్వం వెంటనే కమిటీ ఏర్పాటు చేసి ఉద్యమకారులని గుర్తించాలని ఉద్యమకారుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఉద్యమకారుల డిమాండ్స్:
1) తెలంగాణ తొలి/మలిదశ ఉద్యమకారులను గుర్తించటం కోసం వెంటనే ఒక కమిటీని ఏర్పాటు చేయాలి.
2) 250 గజాల ఇంటి స్థలాన్ని నిరుపేద ఉద్యమకారులందరికి వర్తింపజేయాలి.
3) తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డుని వెంటనే ఏర్పాటు చేయాలి.
4) తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ స్వాతంత్య్ర యోధులుగా గుర్తించాలి.
5)ఉద్యమంలో పాల్గొని నేడు దుర్భరంగా జీవిస్తున్న ఉద్యమకారులకి పెన్షన్ సౌకర్యం, ఉచితిబస్ పాస్, ట్రైన్ పాస్, ఆరోగ్యకార్డు, 10 లక్షల జీవిత భీమాని కల్పించాలి.
6) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఉద్యమకారులందరిని ప్రభుత్వం గౌరవించాలి.
7) నిరుద్యోగ ఉద్యమకారులకి 50 లక్షల వరకు వడ్డీలేని ఋణాలు కేటాయించాలి.
8) విద్యార్థి ఉద్యమకారులకి ఉద్యోగాలలో కోటా కేటాయించాలి.
9) తెలంగాణ ఉద్యమ నాయకుల చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలి. వాళ్ళ విగ్రహాలని టాంక్ బండ్పై ఏర్పాటు చేయాలి.
10) జర్నలిస్టు ఉద్యమకారులకి జర్నలిస్టుల కాలనీలను ఏర్పాటు చేసి ఇండ్లను నిర్మించాలి.
బస్ పాస్, ట్రైన్ పాస్, ఆరోగ్యకార్డు, 10 లక్షల జీవిత భీమాని కల్పించాలి.తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి తెలంగాణ పునఃర్నిర్మాణంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉద్యమకారులందరు అండగా ఉంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చేవెళ్ల పార్లమెంట్ ఇంచార్జి యాలాల మహేశ్వర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కుమ్మరి రమేష్, చేవెళ్ల ఇంచార్జి ఇదులపల్లి రాములు, జిల్లా కార్యదర్శి నవీన్ కుమార్, జిల్లా మహిళా నాయకురాలు బాబాలక్ష్మి, గౌసియాబేగం, శంకర్పల్లి మండల అద్యక్షులు అశోక్, తదితరులు పాల్గొన్నారు.