షాద్ నగర్ లో గుర్తు తెలియని మృత దేహం లభ్యం.– సంఘటన స్థలాన్ని పరిశీలించిన పట్టణ సీఐ ప్రతాప్ లింగం

షాద్ నగర్ లో గుర్తు తెలియని మృత దేహం లభ్యం.– సంఘటన స్థలాన్ని పరిశీలించిన పట్టణ సీఐ ప్రతాప్ లింగం
షాద్నగర్, జ్ఞాన తెలంగాణ : డిసెంబర్ 29రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఓల్డ్ హైవే హైదరాబాద్ రోడ్డులో మహాబోది డైగ్నోస్టిక్ పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. అతని వయసు 50 నుండి 55 సంవత్సరాలు ఉంటాయని పొలీసులు తెలిపారు. ఈ గుర్తుతెలియని మృతదేహాన్ని పట్టణ సీఐ ప్రతాప్ లింగం పరిశీలించారు. తాగిన మైకంలో ఇటుకలపై పడి తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడే పడి చనిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.