రేషన్ కార్డు లబ్ధిదారులను వడబోస్తున్న రేవంత్ సర్కార్.

రేషన్ కార్డు లబ్ధిదారులను వడబోస్తున్న రేవంత్ సర్కార్.
హైదరాబాద్ డిసెంబర్ 24:కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి పౌరసరఫరాల శాఖ కసరత్తు మొదలు పెట్టింది. గతంలో మాదిరి గానే మీసేవ ద్వారానే దరఖాస్తు తీసుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయిం చినట్టు తెలిసింది.దీనికి సంబంధించి దర ఖాస్తు విధానం, నిబంధన లపై సాఫ్ట్‌వేర్‌లో కీలక మా ర్పులు చేయనున్నట్టు విశ్వ సనీయంగా తెలిసింది ఇందులో భాగంగా మీసేవ సాఫ్ట్‌వేర్‌ను పర్యవేక్షిస్తున్న నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ (ఎన్‌ఐసీ)కు పౌరసరఫరాల శాఖ లేఖ రాసినట్టు తెలిసింది.దరఖాస్తులను మీసేవలోనే వడపోసే విధంగా సాఫ్ట్ వేర్‌లోమార్పులు చేయ నున్నట్టు సమాచారం దరఖాస్తుదారు ఆధార్, పాన్‌కార్డును లింక్ చేసి దర ఖాస్తు సమయంలోనే ఆ వ్యక్తికి అతడి కుటుంబానికి సంబంధించిన వివరాలన్నీ తెలిసేలా చర్యలు తీసుకో నున్నారు.ఇందులో నిబంధనలకు మించి ఆస్తులు భూములు ఐటీ చెల్లింపు వంటివి ఉంటే వెంటనే ఆ దరఖాస్తును తిరస్కరించేలా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
అయితే గతంలో అందరి నుంచి దరఖాస్తులు తీసుకునేవారు ఆ తర్వాత వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ఐటీ శాఖ ఆధ్వర్యంలో 360 డిగ్రీల సాఫ్ట్‌వేర్‌తో వడపోసే వారు ఇందులో మిగిలిన వారికి రేషన్ కార్డులను జారీ చేసేవారు ఇప్పుడు మాత్రం ఆదిలోనే దరఖాస్తులను స్క్రూటినీ చేసేలా చర్యలు చేపట్టినట్టు తెలిసింది.భూ పరిమితిని 3.5 ఎక రాలుగా నిర్ణయించినట్టు సమాచారం కొత్త దరఖాస్తులను రైతుబంధు వివరాలతో సరిపోల్చే అంశంపైనా అధికారులు ఆలోచన చేస్తు న్నట్టు తెలిసింది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు లకు సంబంధించి ఈ నెల 27వ తేదీన నిబంధనల తోపాటు మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్టు సమాచారం.ప్రస్తుతం రాష్ట్రంలో 90.40 లక్షల రేషన్ కార్డులుండగా ఇందులో 2.86 కోట్ల మంది లబ్ధిదారులున్నారు కొత్తగా సుమారు 10 లక్షల వరకు దరఖాస్తులు ఉన్నట్టు తెలిసింది ఇప్పుడు వీటితోపా టు కొత్తగా దరఖాస్తు చేసు కునేవారికి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసేందుకు కసరత్తు చేస్తున్నది.