హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.

హైదరాబాద్ డిసెంబర్ 22:హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్‌ వేడుకలను నిర్వహిస్తున్నారు.శుక్రవారం సాయంత్రం 5 నుంచి జరుగనున్న ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు హాజరుకానున్నారు.ఈనేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు.ఈ సమయంలో పలు మార్గాల్లో మూసివేతలు, దారిమళ్లింపులు ఉంటాయని వెల్లడించారు. ఈనేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

You may also like...

Translate »