టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 రీషెడ్యూలు

టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 రీషెడ్యూలు
హైదరాబాద్: గ్రూప్-2 పరీక్షలను టీఎస్‌పీఎస్సీ తొలుత 2023 ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాలని భావించింది. నిరుద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు నవంబరు 2, 3 తేదీలకు రీషెడ్యూల్ చేసింది.
నవంబరు 3 నుంచి అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ చేపట్టడంతో 2024 జనవరి 6, 7 తేదీలకు పరీక్షలు రీషెడ్యూల్ అయ్యాయి. అయితే, కొత్త బోర్డు ఏర్పాటు తరువాతే పరీక్షలు నిర్వహించాలని, వచ్చే నెలలో జరగాల్సినవి మరోసారి రీషెడ్యూలు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు రీషెడ్యూల్ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. తదుపరి ఖాళీ తేదీలు, పరీక్ష కేంద్రాల అందుబాటు తదితర సమాచారం మేరకు కమిషన్ త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలిసింది.