టిఎస్ పిఎస్పీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా: ఇంకా ఆమోదించని గవర్నర్.

టిఎస్ పిఎస్పీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా: ఇంకా ఆమోదించని గవర్నర్.

హైదరాబాద్‌ డిసెంబర్ 12:తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ టీఎస్‌పీ ఎస్సీ, ఛైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి రాజీనామాను గవర్నర్‌ తమిళిసై ఆమోదించలేదు.ఈ మేరకు రాజ్‌భవన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది జనార్దన్‌రెడ్డి రాజీనామాను ఆమోదించినట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో రాజ్‌ భవన్‌ క్లారిటీ ఇచ్చింది ఆయన రాజీనామా ఆమో దం పొందినట్లు వచ్చిన వార్తలు అవాస్త వమని తెలిపింది.సోమవారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన అనంతరం టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ పదవికి జనార్దన్‌రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.గవర్నర్‌ ప్రస్తుతం పుదుచ్చేరి పర్యటనలో ఉన్నారు గ‌వ‌ర్న‌ర్ అక్క‌డి నుంచి వ‌చ్చిన త‌ర్వాత రాజీనామా పై నిర్ణ‌యం తీసుకోవ‌చ్చ‌ని భావిస్తున్నారు.

You may also like...

Translate »